Devara | గ్లోబర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం దేవర (Devara). పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్లో కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తారక్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడని తెలిసిందే. దేవర రెండు పార్టులుగా రానుండగా.. దేవర పార్టు 1 సెప్టెంబర్ 27న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మ్యూజిక్ ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన ఫియర్ సాంగ్, చుట్టమల్లె పాటలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక సినిమాకే హైలెట్‌గా నిలువబోయే ఆయుధ పూజ (Ayudha Pooja) సాంగ్ లుక్ విడుదల చేశారు. ఈ ఆయుధ పూజ సాంగ్‌ను రేపు ఉదయం 11:07 గంటలకు లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించారు. తారక్ దేవరగా ఆయుధాలతో పోరాటం నేపథ్యంలో పాట ఉండబోతున్నట్టు హింట్ ఇస్తున్నాడు కొరటాల శివ.
దేవర ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న తారక్ టీం మంగళవారం చెన్నైలో సందడి చేసింది. రిలీజ్ వరకు ఏదో ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్‌తో అభిమానులను ఫుల్ ఖుషీ చేయాలని తారక్ ఫిక్సయినట్టు అర్థమవుతోంది. ఈ చిత్రంతో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. దేవరలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. మలయాళ యాక్టర్ షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ, హిమజ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రక్తంతో సముద్రమే ఎరుపెక్కిన కథ.. మా దేవర కథ.. అంటూ యాక్షన్ పార్టుతో సాగుతున్న దేవర ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచడమే కాదు సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది.
The weapons are not just wielded they’re worshipped 🙏🏻
When a weapon like #Devara comes into play – It’s a CELEBRATION 🔥
Bringing you the Most Awaited Goosebumps Packed #AyudhaPooja on September 19th at 11:07 AM 💥
An @AnirudhOfficial Sambhavam 🥁 #DevaraOnSep27th
Man of… pic.twitter.com/a8xIBVAlxV
— NTR Arts (@NTRArtsOfficial) September 18, 2024
Vetrimaaran | వెట్రిమారన్ విడుదల పార్ట్ 2 షూట్ టైం.. ఏ సీన్లు చిత్రీకరిస్తున్నారో తెలుసా..?
UI The Movie | మేకింగ్‌లో హిస్టరీ.. స్టన్నింగ్‌గా ఉపేంద్ర యూఐ లుక్
Jr NTR | మనం భాషాపరంగా మాత్రమే విభజించబడ్డాం.. తారక్ కామెంట్స్ వైరల్