గతేడాది బాలీవుడ్ (Bollywood) నుంచి విడుదలైన సినిమాల్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది మల్టీ స్టారర్ ప్రాజెక్టు బ్రహ్మాస్త్ర (Brahmastra). అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రణ్ బీర్ కపూర్, అలియాభట్ (Alia Bhatt) ప్రధాన పాత్రల్లో నటించగా.. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, నాగార్జున, మౌనీరాయ్ కీలక పాత్రల్లో నటించారు. కాగా బ్రహ్మాస్త్ర ప్రాంఛైజీగా మూడు పార్టులుగా వస్తున్న విషయం తెలిసిందే. చాలా రోజుల తర్వాత బ్రహ్మాస్త్ర పార్టు -2, పార్టు -3లపై మూవీ లవర్స్ కు అప్డేట్ అందించాడు అయాన్ ముఖర్జీ.
నేను పార్ట్ -2, పార్ట్-3 కోసం విజన్‌ని రూపొందించడంపై దృష్టి పెట్టాను. ఇది పార్ట్ 1 కంటే పెద్దదిగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉంటుందని నాకు తెలుసు. బ్రహ్మాస్త్ర పార్ట్ -2, పార్ట్-3 ఫైనల్ స్క్రిప్ట్‌ను రెడీ చేసేందుకు మరికొంత సమయం కావాలి. ఈ రెండు సినిమాలను కలిసి తీయాలని నిర్ణయించుకున్నా. అలగే వీలైనంత త్వరగా విడుదల చేయాలనుకుంటున్నా. అంతేకాదు బ్రహ్మాస్త్ర పార్ట్ -2ను 2026లో , పార్ట్-3ని 2027లో విడుదల చేయనున్నట్టు అయాన్ ముఖర్జీ ప్రకటించాడు.
ఈ లెక్కన బ్రహ్మాస్త్ర ట్రియాలజీలో భాగంగా పార్ట్ -2 రావడానికే మరో మూడు సంవత్సరాలు పడుతుందన్నమాట. మరోవైపు పార్ట్ 3ని చూడాలంటే నాలుగేళ్లు పడుతుంది. మొత్తానికి బ్రహ్మాస్త్ర ప్రాంచైజీపై క్లారిటీ ఇచ్చేసి సస్పెన్స్ కు తెరదించాడు అయాన్ ముఖర్జీ. ఫస్ట్ పార్టులో దీపికా పదుకొనే అమృతగా అతిథి పాత్రలో మెరిసింది. మరి సెకండ్ పార్ట్‌లో కూడా దీపికా పదుకొనే కనిపించనుందా..? లేదా..? ఇంతకీ సీక్వెల్ పార్ట్స్‌లో కొత్త స్టార్లు ఎవరెవరు కనిపించబోతున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
BIGGG NEWS… AYAN MUKERJI ANNOUNCES ’BRAHMASTRA’ 2 & 3… BOTH PARTS TO BE SHOT TOGETHER… #AyanMukerji announces the details – including the release – of #Brahmāstra 2 and 3…
⭐️ #Brahmāstra2: 2026
⭐️ #Brahmāstra3: 2027
Produced by Star Studios, Dharma Productions, Prime Focus… pic.twitter.com/7CtkL9QPc6
— taran adarsh (@taran_adarsh) April 4, 2023
Read Also
Athulyaa Ravi | మెగాస్టార్ చిరంజీవితో అతుల్య రవి.. ట్రెండింగ్‌లో ఫొటోలు