BCCI : భారత్‌లో మహిళల క్రికెట్ అభివృద్దికి పలు చర్యలు తీసుకుంటున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మరో కీలక నిర్ణయం తీసునుంది. ఇటీవలే వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2025) ఛాంపియన్‌గా అవతరించిన టీమిండియా క్రికెటర్లకు ప్రోత్సాహకంగా మ్యాచ్ ఫీజులను భారీగా పెంచింది. ఇకపై ఒక్క వన్డే మ్యాచ్‌కు రూ.50 వేలు ఇస్తామని సోమవారం జరిగిన సమావేశంలో బీసీసీఐ బృందం తీర్మానించింది.
‘క్రికెట్ ఇక ఏమాత్రం జెంటిల్మన్ గేమ్ కాదు’ అని నిరూపిస్తున్న భారత మహిళా క్రికెటర్ల పంటపండింది. పురుష క్రికెటర్లతో సమానమైన జీతభత్యాలు అందించేందుకు కృషి చేస్తున్న బీసీసీఐ మ్యాచ్ ఫీజులను భారీగా పెంచేసింది. అంతర్జాతీయ మ్యాచ్‌లకే కాకుండా దేశవాళీ లీగ్స్‌లోనూ చెల్లిస్తున్న ఫీజులను సవరించింది. ఈరోజువర్చువల్గా జరిగిన సమావేశంలో బీసీసీఐ ప్రతినిధులు మహిళా క్రికెటర్లు తీపికబురు చెబుతూ.. వన్డే మ్యాచ్ ఫీజును రూ.50 వేలకు పెంచారు.
🚨 BREAKING NEWS 🚨
𝘽𝘾𝘾𝙄 𝙧𝙚𝙫𝙞𝙨𝙚𝙨 𝙢𝙖𝙩𝙘𝙝-𝙛𝙚𝙚 𝙛𝙤𝙧 𝙙𝙤𝙢𝙚𝙨𝙩𝙞𝙘 𝙬𝙤𝙢𝙚𝙣 𝙘𝙧𝙞𝙘𝙠𝙚𝙩𝙚𝙧𝙨
𝗦𝗿. 𝗪𝗼𝗺𝗲𝗻: (𝗣𝗹𝗮𝘆𝗶𝗻𝗴 𝗫𝗜)
INR 50,000 per day in one-day/multi-day
INR 25,000 for T20𝗝𝗿 𝗰𝗿𝗶𝗰𝗸𝗲𝘁: (𝗣𝗹𝗮𝘆𝗶𝗻𝗴 𝗫𝗜)
INR 25,000 for… pic.twitter.com/o7YcZZmFKs— Cricbuzz (@cricbuzz) December 22, 2025
ఇకపై వన్డేలతో పాటు 50 ఓవర్ల ఫార్మాట్లో జరిగే మల్టీ డే మ్యాచ్‌లకు అరలక్ష చెల్లిస్తారు. స్క్వాడ్‌లోని సభ్యులకు మాత్రం రూ. 25వేలు లభిస్తాయి. ఇక రిజర్వ్ క్రికెటర్లు ఇందులో సగం అంటే.. రూ. 12,500 వేతనంగా అందుకుంటారు. ఇదివరకూ సీనియర్ జట్టులోని సభ్యలకు మ్యాచ్‌కు రూ.20 వేలతో, బెంచ్ ప్లేయర్లకు రూ.10 వేలతో మాత్రమే సరిపెట్టుకునేవారు.
జూనియర్ క్రికెట్ టోర్నమెంట్ల మ్యాచ్ ఫీజులను కూడా పెంచారు. సవరించిన వేతనం ప్రకారం తుదిజట్టులోని క్రికెటర్లకు రూ.25,000లు చెల్లిస్తారు. రిజర్వ్ ప్లేయర్లకు రూ.12,500లు ముడతాయి. టీ20 మ్యాచ్‌లకు రూ.12,500.. బెంచ్ ప్లేయర్లకు రూ.6,250 లభిస్తాయి. జై షా(Jai Shah) బీసీసీఐ కార్యదర్శిగా ఉన్నప్పుడు మొదలైన ఈ సంస్కరణలు.. ఆయన ఐసీసీ ఛైర్మన్ అయ్యాక కూడా కొనసాగుతున్నాయి. ఐసీసీ బాస్ అయ్యాక ఐసీసీ టోర్నీ విజేతగా నిలిచిన మహిళల జట్టుకు పురుషులతో సమానమైన ప్రైజ్‌మనీని ఇస్తున్న విషయం తెలిసిందే.