Athulyaa Ravi | మెగాస్టార్ చిరంజీవితో అతుల్య రవి.. ట్రెండింగ్‌లో ఫొటోలు
టాలీవుడ్ కమర్షియల్ ఎంటర్టైనర్ మీటర్ (Meter)లో కోలీవుడ్ భామ అతుల్య రవి (Athulyaa Ravi) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కెరీర్ తొలినాళ్లలోనే మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) ని కలిసే అవకాశమొస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడలాంటి క్షణాలనే ఎంజాయ్ చేస్తోంది అతుల్య రవి.
టాలీవుడ్లో రాబోతున్న కొత్త చిత్రాల్లో ఒకటి మీటర్ (Meter). యువ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తోన్న ఈ కమర్షియల్ ఎంటర్టైనర్లోకోలీవుడ్ భామ అతుల్య రవి (Athulyaa Ravi) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ భామ మీటర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది . కెరీర్ తొలినాళ్లలోనే మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) ని కలిసే అవకాశమొస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడలాంటి క్షణాలనే ఎంజాయ్ చేస్తోంది అతుల్య రవి. ఈ మూవీ ఏప్రిల్ 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో కిరణ్ అబ్బవరం టీం ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది.
అతుల్య రవి మీటర్ ప్రమోషన్స్ టైంలో చిరంజీవిని కలిసింది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా అందరితో షేర్ చేసుకుంది.మీటర్ ప్రమోషన్స్ సమయంలో చిరంజీవిగారిని కలవడం చాలా సంతోషకరమైన క్షణం. నాకు ఆశీస్సులు అందించి నాలో పాజిటివ్ ఎనర్జీని నింపిన చిరంజీవి గారికి దన్యవాదాలు. ఈ క్షణం నాకు జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం.. అంటూ ఆయనతో దిగిన ఫొటోను పోస్ట్ చేయగా నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. మీటర్ బ్లాక్ బస్టర్ హిట్టందుకోవాలని ఈ సందర్భంగా చిరంజీవి ఆకాంక్షించారు.
మీటర్ చిత్రంలో పవన్ , పోసాని కృష్ణ మురళి, సప్తగిరి ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. మీటర్ నుంచి ఇప్పటికే విడుదల చేసిన ఓ బేబీ జారిపోమాకే, ఛమ్మక్ఛమ్మక్ పోరి సాంగ్స్ తోపాటు టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. కిరణ్ అబ్బవరం ఇప్పటికే రూల్స్ రంజన్ లో కూడా నటిస్తుండగా.. మరోవైపు ఇటీవలే కొత్త ప్రాజెక్ట్ KA9ను కూడా లాంఛ్ చేశాడు. విశ్వకరుణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
#Meter gets a MEGA boost 💥💥
Heroine @AthulyaOfficial met MEGASTAR @KChiruTweets Garu ❤️
He wished and blessed the team for a blockbuster success 💥#MeterOnApril7th@Kiran_Abbavaram #RameshKaduri #SaiKartheek #VenkatCDilip #JV @ClapEntrtmnt @MythriOfficial @SonyMusicSouth pic.twitter.com/WaxwQ3o61i
— BA Raju’s Team (@baraju_SuperHit) April 4, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

