శనివారం 23 జనవరి 2021
Cinema - Dec 05, 2020 , 13:30:49

బిగ్ బాస్ లీక్.. ఈ వారం ఎలిమినేట్ కానుంది ఎవ‌రంటే..!

బిగ్ బాస్ లీక్.. ఈ వారం ఎలిమినేట్ కానుంది ఎవ‌రంటే..!

నాగార్జున హోస్ట్ చేస్తున్న బుల్లితెర కార్య‌క్ర‌మం బిగ్ బాస్ సీజ‌న్ 4 లో ఇంకా మూడు వారాలు మాత్ర‌మే మిగిలి ఉన్నాయి. ఈ వారం ఒక‌రు, వ‌చ్చే వారం మ‌రొక‌రు ఎలిమినేట్ కానుండ‌గా చివ‌రి వారం ఐదుగురు స‌భ్యులు మాత్ర‌మే హౌజ్‌లో ఉంటారు. ఈ ఐదుగురిలో ఒక‌రు బిగ్ బాస్ సీజన్ 4 విజేత అవుతారు. డిసెంబ‌ర్ 20న ఫినాలే జ‌రుగుతుంద‌ని అంద‌రు బావిస్తుండ‌గా, గ్రాండ్ ఈవెంట్‌కి  గెస్ట్‌గా జూనియ‌ర్ ఎన్టీఆర్ లేదంటే అల్లు అర్జున్ హాజ‌రు అవుతార‌ని తెలుస్తుంది.

బిగ్ బాస్ సీజ‌న్ 4 కార్య‌క్ర‌మానికి సంబంధించి 13వ వారం చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈ వారం ఒక‌రు ఎలిమినేట్ కానుండ‌గా, నామినేష‌న్‌లో అవినాష్‌, అఖిల్, మోనాల్; అభిజీత్, హారిక ఉన్నారు. వీరిలో ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌నే ఆస‌క్తి అంద‌రిలో ఉంది. గ‌త‌వారం ఎవిక్ష‌న్ పాస్‌తో ఎలిమినేట్ కాకుండా బ‌య‌ట‌పడ్డ అవినాష్ ఈ వారం మాత్రం హౌజ్‌ని వీడ‌క త‌ప్పదు అని అంటున్నారు.  సింప‌థీ గేమ్  అత‌ని కొంప ముంచింద‌ని కొంద‌రు నెటిజ‌న్స్ చెబుతున్నారు. 


logo