Seema Haider | పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ (Seema Haider), ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్ మీనా (Sachin Meena) ప్రేమ కథ గురించి అందరికీ తెలిసిందే. పబ్జీ గేమ్ (PUBG Game) ద్వారా పరిచయమైన సచిన్ కోసం సీమా తన నలుగురి పిల్లలతో అతి కష్టంమీద పాకిస్థాన్ (Pakistan) నుంచి భారత్ లోకి అడుగుపెట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. అక్రమంగా భారత్‌కు వచ్చిన ఆమె ఇప్పుడు ఓ సెలబ్రిటీ అయిపోయింది. ఆమెకు సినిమా, రాజకీయ ఆఫర్లు వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఆమె జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం రాబోతోంది.
‘కరాచీ టు నోయిడా’ (Karachi to Noida) పేరుతో అమిత్ జానీ (Amit Jani) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన తాజాగా వెల్లడించారు. పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన వీరి మధ్య ప్రేమ ఎలా మొదలైంది. ప్రియుడి కోసం పాక్ నుంచి భారత్‌కు ఎలా వచ్చింది. సీమా.. పాక్ ఏజెంట్ అవునా..? కాదా..? వంటి విషయాలు ఈ చిత్రం ద్వారా ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. సీమా గురించి అన్ని విషయాలను ఈ చిత్రంలో చూపించనున్నట్లు చెప్పారు. అందుకోసం ఆమె జీవితం గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు సీమా మాజీ భర్త గులాం హైదర్ (Ghulam Haider) ను సంప్రదించాలనుకుంటున్నట్లు వివరించారు. ఈ మేరకు గులాంను ఢిల్లీ లేదా ముంబైకి రావాలని ఆహ్వానించినట్లు చెప్పారు. ఒకవేళ ఆయన భారత్‌కు రాలేకపోతే ప్రస్తుతం అతను ఉన్న సౌదీ అరేబియాకు రచయితను పంపిస్తామన్నారు. ఈ చిత్రంలోని సీమా, సచిన్ పాత్రల్లో ఎవరు నటించాలన్నది మరో రెండు రోజుల్లో పూర్తవుతుందన్నారు. ఈ చిత్ర షూటింగ్ దుబాయ్‌లో ఉంటుందని ఆయన వెల్లడించారు.
కాగా, పాక్ జాతీయురాలైన 30 ఏళ్ల సీమా హైదర్.. ఉత్తరప్రదేశ్ కు చెందిన 22 ఏళ్ల సచిన్ మీనా (Sachin Meena)తో పబ్జీ గేమ్ ద్వారా ప్రేమలో పడింది. అతడి కోసం నలుగురు పిల్లలతో సహా పాక్ సరిహద్దును దాటి భారత్ లోకి అక్రమంగా అడుగుపెట్టింది. అనంతరం సచిన్ మీనాను వివాహం చేసుకున్న సీమా.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో నివాసముంటోంది. మరోవైపు భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన సీమా హైదర్ తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె మామ పాకిస్థాన్ ఆర్మీలో సుబేదార్ కాగా, సోదరుడు కూడా పాక్ ఆర్మీలో సైనికుడని తెలిసింది. ఈ నేపథ్యంలో సీమా హైదర్‌ను పాకిస్థాన్ స్పైగా అనుమానిస్తున్నారు.
Also Read..
Rahul Gandhi | నెలలతరబడి మణిపూర్ మండుతుంటే.. ప్రధాని నవ్వుతూ జోకులేశారు : మోదీపై రాహుల్ ఫైర్
Teapot | ఈ టీపాట్ ధర రూ. 24 కోట్లు.. ఎందుకు ఇంత రేట్.. అసలేంటి దీని ప్రత్యేకత !
Samantha | సమంతకు అరుదైన గౌరవం.. వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పరేడ్‌కు ఆహ్వానం