Idly Kadai | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) అభిమానులను ఖుషీ చేసేందుకు వరుస సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. ఈ మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టుల్లో ఒకటి ధనుష్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న ఇడ్లీ కడై (IdlyKadai). నిత్యమీనన్ హీరోయిన్గా నటిస్తోంది. DD4 ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ చిత్రాన్ని ఆకాశ్ (డెబ్యూ) తెరకెక్కిస్తున్నాడు.
ఈ చిత్రంలో ప్రముఖ నటుడు అరుణ్ విజయ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ విషయం అధికారికంగా ఫైనల్ తాజా సమాచారం ప్రకారం ఇందులో విలన్‌గా కనిపించబోతున్నాడు. కోలీవుడ్ సర్కిల్ కథనాల ప్రకారం ఇడ్లీ కడై షూటింగ్ రామనాథపురంలో కొనసాగుతోంది. ప్రస్తుతం అరుణ్ విజయ్‌పై వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని ఇన్సైడ్ టాక్. ఇక సిల్వర్ స్క్రీన్‌పై ధనుష్, అరుణ్ విజయ్ మధ్య ఫైట్ ఎలా ఉండబోతుందన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే లాంచ్ చేసిన ప్రీ లుక్, ఫస్ట్ లుక్ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతుండగా.. ఇటీవలే పొంగళ్ కానుకగా స్పెషల్ పోస్టర్లను కూడా విడుదల చేశారు. ఒక పోస్టర్లో ధనుష్, నిత్యమీనన్ చేనులో నిలబడి వర్షంలో తడిసి ముద్దవుతుండగా.. మరో పోస్టర్లో తెలుపు రంగు చొక్కా, లుంగీలో మర్రి చెట్టు కింద లేగదూడను పట్టుకొని కూర్చుండటం చూడొచ్చు.
తిరు సినిమా తర్వాత నిత్యమీనన్, ధనుష్ కాంబోలో వస్తున్న ప్రాజెక్టు కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీలో సత్యరాజ్, అశోక్ సెల్వన్, రాజ్‌కిరణ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
ధనుష్ మరోవైపు శేఖర్ కమ్ముల డైరెక్షన్లో కుబేరలో నటిస్తున్నాడని తెలిసిందే. దీంతోపాటు హిందీలో రాంజానా, అట్రాంగి రే తర్వాత ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్లో హ్యాట్రిక్ మూవీ తేరే ఇష్క్ మే (Tere ishk mein) సినిమా కూడా చేస్తున్నాడు.
🔥 #IdlyKadai – Big Update at 5 PM! 🎬✨
The film’s shoot is happening in Ramanathapuram, with #ArunVijay scenes being filmed!
Buzz is that he plays the antagonist – an intense face-off with #Dhanush loading! 🔥👊 pic.twitter.com/zsO64mwCOP
— Kollywood Now (@kollywoodnow) February 1, 2025
Union Budget 2025 | గంటా 15 నిమిషాల పాటు కొనసాగిన నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం