Actor Siddique | మీటూ కేసులో మలయాళ సీనియర్ నటుడు సిద్ధిఖీపై (Actor Siddique) అరెస్ట్ వారెంట్ (Arrest Warrant) జారీ అయ్యింది. తనను రేప్ చేశాడంటూ నటి రేవతి సంపత్ (Revathy Sampath).. సిద్ధిఖీపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. నటి ఫిర్యాదును స్వీకరించిన తిరువనంతపురం పోలీసులు సిద్ధిఖీపై అత్యాచారం సహా నాన్ బెయిలబుల్ నేరాల కింద కేసులు నమోదు చేశారు.
ఈ కేసుల నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం సిద్ధిఖీ కేరళ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం నటుడి పిటిషన్‌కు కొట్టివేసింది. కోర్టు ఇచ్చిన తీర్పుతో కేరళ పోలీసులు సిద్ధిఖీని అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు అతడికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం నటుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది.
మలయాళ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. మలయాళ చిత్ర పరిశ్రమలోని మహిళలపై జరుగుతోన్న వేధింపులపై కేరళ ప్రభుత్వం జస్టిస్ హేమ కమిటీ (Hema Committee Report)ని ఏర్పాటు చేయగా.. ఈ కమిటీ సిద్ధం చేసిన రిపోర్ట్ ఆ పరిశ్రమను కుదిపేస్తోంది. ఈ నివేదిక నేపథ్యంలో నటి రేవతి సంపత్.. నటుడు సిద్ధిఖీపై అత్యచారం ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలు మాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.
అసలు ఏం జరిగిందంటే.. సిద్ధిఖీ తనను ట్రాప్ చేసి రేప్ చేశాడంటూ రేవతి సంపత్ ఆరోపించింది. ఒక సినిమా గురించి సిద్ధిఖీ వద్దకు వెళ్లినప్పుడు నాపై అత్యచారం చేశాడు. తనతో పాటు తన స్నేహితులను కూడా లైంగికంగా సిద్ధిఖీ వేధించాడు అంటూ రేవతి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ నేపథ్యంలో సిద్ధిఖీపై లైంగిక ఆరోపణలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి రేవతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read..
Jani Master | జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్‌పై తీర్పును వాయిదా వేసిన రంగారెడ్డి కోర్టు
Asha Bhosle | విడాకుల సంఖ్య పెరగడానికి ఇదే ప్రధాన కారణం : ఆశా భోంస్లే