Jani Master | జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్‌పై తీర్పును వాయిదా వేసిన రంగారెడ్డి కోర్టు
Jani Master | లైంగిక వేధింపులో అరెస్టయిన జానీ మాస్టర్‌ను ఐదురోజుల కస్టడీకి ఇవ్వాలని నార్సింగి పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం రంగారెడ్డి కోర్టు విచారణ జరిపింది. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును బుధవారానికి వాయిదా వేసింది.
Jani Master | లైంగిక వేధింపులో అరెస్టయిన జానీ మాస్టర్‌ను ఐదురోజుల కస్టడీకి ఇవ్వాలని నార్సింగి పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం రంగారెడ్డి కోర్టు విచారణ జరిపింది. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును బుధవారానికి వాయిదా వేసింది. మరో వైపు కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ జానీ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరుగనున్నది. ప్రస్తుతం అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్‌ను ఈ నెల 19న పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
లైంగిక వేధింపుల కేసు, పోక్సో కింద కేసులు నమోదవడంతో జానీ పరారీలో ఉండగా.. పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ పోలీసుల బృందం జానీని హైదరాబాద్‌కు తరలించి.. ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ను విధించింది. ప్రస్తుతం జానీ మాస్టర్ చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. కొరియోగ్రాఫర్‌ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు విచారణ మంగళావారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Itllu Arjuna | ‘ఇట్లు అర్జున’ మ్యూజికల్ ఈవెంట్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. కింగ్ నాగార్జున, అఖిల్ కూడా సందడి!
MLA Sudheer Reddy | జైపాల్ రెడ్డిపై లేని ప్రేమంతా ఒలకబోస్తున్న రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Road Accident | డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి
చెకుముకి సైన్స్ సంబురాలు-2026 పోస్టర్ ఆవిష్కరణ
Narnoor | గోవర్ధన్ గుట్టపై ఆదివాసుల సాంప్రదాయ పూజలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

