Aishwarya Rai | బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan) ఫ్యాషన్ (Fashion) లుక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ సినీ వేడుకలోనైనా, ఫ్యాషన్ షోలోనైనా ఐష్ విభిన్న కాస్ట్యూమ్స్‌తో అలరిస్తుంటుంది. ఇక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, పారిస్ ఫ్యాషన్ వీక్ వంటి ప్రపంచ వేదికగా జరిగే ఫ్యాషన్ షోలకు కొత్త కళను తెస్తుంటుంది ఈ నీలి కళ్ల సుందరి. ఆయా వేడుకల్లో రెడ్ కార్పెట్‌పై అలా నడుచుకుంటూ వస్తుంటే కెమెరా కళ్లన్నీ ఐష్ (Aish)వైపే ఉంటాయి.
తాజాగా ఐశ్వర్య పారిస్ ఫ్యాషన్ వీక్ (Paris Fashion Week)లో సందడి చేసింది. పారిస్‌లోని ఐకానిక్ పలైస్ గార్నియర్ ఒపెరా హౌస్‌లో జరిగిన ఈ ఫ్యాషన్‌లో ర్యాంప్‌పై క్యాట్‌వాక్‌తో హొయలు పోయింది. బెలూన్ థీమ్ రెడ్ డ్రెస్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రేక్షకులను నమస్తేతో పలకరించింది. ఫ్లైయింగ్ కిస్ ఇస్తూ సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇక ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో మరో బాలీవుడ్ స్టార్ నటి అలియా భట్ (Alia Bhatt) కూడా సందడి చేశారు. లోరియల్ ప్యారిస్‌కు ప్రాతినధ్యం వహిస్తున్న అలియా.. మెటాలిక్ బ్లాక్ ఆఫ్ షోల్డర్ జంప్‌సూట్‌తో గ్లామరస్ లుక్‌తో ఆకట్టుకుంది. అమెరికన్ నటి, మెడల్ ఆండీ మెక్డోవెల్తో కలిసి ప్రేక్షకులకు ఫ్లైయింగ్ కిస్ ఇస్తూ ర్యాంప్ వాక్ చేసింది. ప్రస్తుతం అలియా ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి.
Aishwarya Alia2
Alia Bhatt at L’Oréal Paris fashion week 📸 pic.twitter.com/NW3RA5n41R
— Alia’s nation (@Aliasnation) September 23, 2024
Beauty queen 👸 😍 #AliaBhatt pic.twitter.com/WoTam0m4AS
— ♥♬ ℙ𝕆𝕠ʲÃ 💗 (@spreadlovejoy22) September 24, 2024
Alia Bhatt at L’Oréal Paris fashion week today 📸 pic.twitter.com/HDoFxg7EDm
— Alia’s nation (@Aliasnation) September 23, 2024
Also Read..
Iron Dome: 200 రాకెట్లతో హిజ్బొల్లా ఫైరింగ్.. పేల్చేసిన ఇజ్రాయిల్ ఐరన్ డోమ్.. వీడియో
Pawan Kalyan | పవన్ ప్రాయశ్చిత్త దీక్ష.. విజయవాడ దుర్గమ్మ ఆలయ మెట్లు శుభ్రం చేసిన డిప్యూటీ సీఎం