హైదరాబాద్: హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న విమానానికి పెను ముప్పు తప్పింది. శంషాబాద్ (Shamshabad) నుంచి తిరుపతి బయల్దేరిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట సమీపంలో ఉండగా సాంకేతిక సమస్యను గుర్తించిన పైలట్.. వెంటనే విషయాన్ని ఏటీసీ సెంటర్‌కు తెలియజేశారు. అత్యవసర ల్యాండింగ్‌కు (Emergency Landing) అనుమతి కోరారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు అనుమతి ఇవ్వడంతో ఒంటిమిట్ట నుంచి తిరిగివచ్చింది. విమానంలో ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని సిబ్బంది వెల్లడించారు. విమానంలో మొత్తం 66 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు.