45 the movie| కన్నడ స్టార్ యాక్టర్ శివ రాజ్‌కుమార్ (Shivarajkumar), ఉపేంద్ర (Upendra) లీడ్ రోల్స్ లో నటించిన మల్టీస్టారర్ ’45’ (45). డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని సూరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం ఇక తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు.
ఈవెంట్లో శివ రాజ్ కుమార్ మామాట్లాడుతూ.. తెలుగు వాళ్లు మంచి సినిమాలను ఎప్పుడూ ఆదిస్తారన్నాడు. వేద సినిమా తర్వాత మళ్లీ 45 మూవీ కోసం హైదరాబాద్‌కు వచ్చాను. అర్జున్ జన్య నాలుగైదు నిమిషాల్లోనే కథను చెప్పారు. ఇంటర్వెల్, క్లైమాక్స్ అద్భుతంగా అనిపించడంతో ఈ స్టోరీని మీరే డైరెక్ట్ చేయండని అర్జున్‌కు సలహా ఇచ్చాను. మొదట రెండు మూడు సీన్లు యానిమేషన్స్‌లో షూట్ చేశారు. ఈ సీన్లు చూసిన నిర్మాత రమేశ్ అర్జున్ జన్యకు అవకాశమిస్తే సరైన న్యాయం చేశాడన్నాడు.
అర్జున్ కథను చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. ఆయన మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంత సక్సెస్ అయ్యారో నాకు తెలుసు. ఈ కథను నరేట్ చేస్తున్నప్పుడు ప్రతీ పాత్రను ఆయన నటించి మరీ చూపించారు. ముందుగా ఓ సీన్‌ను షూట్ చేసి.. దానికి డీఐ, డబ్బింగ్ పూర్తి చేసి నిర్మాతకు థియేటర్లో చూపించారు. ఆ తర్వాత సినిమాను మొదలుపెట్టామన్నాడు. శివన్నను ఇలా ఇంతవరకు ఎక్కడా ఏ సినిమాలో కూడా చూడలేదు. ఇంతవరకూ నాకెవ్వరూ ఇవ్వని రోల్‌ను చాలా ధైర్యంగా అర్జున్ నాకు ఇచ్చారన్నాడు. సౌమ్యంగా కనిపించే అర్జున్ సిల్వర్ స్క్రీన్‌ఫై మాత్రం విధ్వంసం సృష్టించారని చెప్పుకొచ్చాడు.
Actor Shivaji | హీరోయిన్ల డ్రెస్సులపై కామెంట్స్.. శివాజీకి నిర్మాత ఎస్కేఎన్ కౌంటర్
Thalapathy Vijay | ‘ఇదే నా చివరి సినిమా’.. సినిమాలకు గుడ్ బై చెప్పిన దళపతి విజయ్
Rajendran | గుండు వెనుక విషాద కథ.. అదే రాజేంద్రన్‌కు వరంగా మారిందట!