They Call Him OG | టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్లో నటిస్తోన్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ ఓజీ. పాన్ ఇండియా గ్యాంగ్ స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీలో ప్రియాంకా అరుళ్ మోహన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శామ్, శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఓజీతో బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ టాలీవుడ్ డెబ్యూ ఇస్తున్నాడు.
ఈ చిత్రంలో బుట్టబొమ్మ ఫేం అర్జున్ దాస్ కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. తాజాగా మేకర్స్ అర్జున్ దాస్ క్యారెక్టర్ పోస్టర్ను విడుదల చేశారు. బాక్సింగ్ ప్రిపరేషన్లో ఉన్న అర్జున్ దాస్ ఇంటెన్స్ పోస్టర్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తోంది. ఇంతకీ డైరెక్టర్ సుజిత్ అర్జున్ దాస్ కోసం ఎలాంటి పాత్రను డిజైన్ చేశాడోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్. ఇందులో అర్జున్ పాత్రలో కనిపించనుండగా.. ఆ రోల్ ఎలా ఉండబోతుందని తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
డీవీవీ ఎంటర్టైన్మెంట్స్పై డీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ఓజీకి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఓజీ సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా తెలుగుతోపాటు పలు భారతీయ భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీకి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Presenting the ferocious @iam_arjundas from the world of #TheyCallHimOG 💥💥
Gear up for the Power Packed experience on Sep 25th!!#OG @PawanKalyan @sujeethsign @musicthaman @dvvmovies pic.twitter.com/46xjKQGKBu
— BA Raju’s Team (@baraju_SuperHit) September 17, 2025
Jailer 2 | చెన్నై టు కేరళ.. జైలర్ 2 గురించి రజినీకాంత్ ఏమన్నాడంటే..?
Junior | ఇక ఓటీటీలోకి గాలి కిరీటి జూనియర్.. ఇంతకీ ఏ ప్లాట్ఫాంలోనో తెలుసా..?