Junior | గాలి కిరీటి రెడ్డి హీరోగా డెబ్యూ ఇచ్చిన చిత్రం జూనియర్ (Junior). శ్రీలీల హీరోయిన్గా నటించింది. పాన్ ఇండియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీ జులై 18న విడుదలైంది. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో రిలీజైన జూనియర్ మిక్స్డ్ టాక్‌తో స్క్రీనింగ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్లో తన స్థానాన్ని నిలుపుకోలేకపోయింది. అయితే థియేటర్లలో ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయిన ఈ చిత్రం ఇక డిజిటల్ ప్లాట్‌ఫాంలో తన లక్‌ను పరీక్షించుకునేందుకు రెడీ అయింది.
బాలీవుడ్ బ్యూటీ జెనీలియా కీలక పాత్రలో నటించింది. జూనియర్ మూవీ పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో ప్రీమియర్ కానుంది. జూనియర్ సెప్టెంబర్ 19 (శుక్రవారం) నుంచి ఆహాలో ప్రీమియర్ కానున్నట్టు ఇప్పుడొక వార్త నెట్టింట వైరల్ అవుతోంది. మరోవైపు అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా ప్రీమియర్ కానున్నట్టు వార్తలు వస్తుండగా.. ఈ వార్తలపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.
రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీని పాపులర్ ప్రొడక్షన్ హౌస్ వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజనీ కొర్రపాటి నిర్మించారు. ఈ చిత్రంలో రావు రమేశ్ , రవిచంద్ర్, సుధారాణి, సత్య, హర్ష చెముడు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
Mirai | మిరాయ్’లో శ్రీరాముడిగా నటించింది ఎవరో తెలుసా? ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్!
OG | ఓజీ పిల్లర్స్ ఒకే ఫ్రేములో.. మిలియన్ డాలర్ పిక్చర్ అంటూ ట్వీట్