Aishwarya Rai | బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్యరాయ్ బచ్చన్ వైవాహిక జీవితంపై ఊగాహానాలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ జంట విడిపోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పటి వరకు ఇద్దరు విడాకులపై మాత్రం స్పందించలేదు. తాజాగా ప్రముఖ యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ ప్రహ్లాద్ కక్కర్ అభిషేక్-ఐశ్వర్య విడాకులు, జయాబచ్చన్‌తో ఐశ్వర్య రిలేషన్‌పై ఆయన స్పందించారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. వాస్తవానికి అభిషేక్, ఐశ్వర్య ప్రస్తుతం విడిగా ఉంటున్నారని, ఐశ్వర్య తన తల్లితో ఆమె నివాసంలో ఉంటున్నట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై ప్రహ్లాద్ కక్కర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐశ్వర్య తల్లి బృందా రాయ్ నివసించే భవనంలోనే తానం నివాసం ఉంటున్నారని.. ఇక్కడ ఐష్ ఎంత సమయం గడుపుతుందో తనకు తెలుసునన్నారు. బృందా ఆరోగ్యం బాగోలేనందున.. ఐశ్వర్య తరచూ ఆమె ఇంటికి వస్తుందన్నారు.
తన కూతురు ఆరాధ్యను పాఠశాలకు పంపేందుకు వెళ్లి.. తిరిగి తీసుకు వెళ్తుందని.. అదే సమయంలో తనకు వీలుదొరికినప్పుడల్లా తల్లి ఇంటికి వస్తుందని ప్రహ్లాద్ కక్కర్ వెల్లడించారు. సమయం దొరికినప్పుడల్లా తల్లితో గడుపుతుందని.. ఆమె తన తల్లికి ఎంత దగ్గరగా ఉందో.. ఆమెపై ఎంత శ్రద్ధ వహిస్తుందో తనకు తెలుసునన్నారు. అయితే, ఐశ్వర్య రాయ్‌కి అత్త జయ బచ్చన్, వదిన శ్వేతతో సమస్యలు ఉన్నాయని.. విడాకులు తీసుకునే విషయంపై ఆలోచిస్తుందన్న వార్తలపై కక్కర్ స్పందిస్తూ.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. తన వైవాహిక జీవితానికి ముగింపు పలుకబోతోందని, ఎందుకంటే తల్లితోనే ఉంటుందని చెబుతున్నారరన్నారు. ఆమె కూతురు స్కూల్లో ఉన్న సమయంలోనే తల్లి వద్దకు వచ్చి సమయం గడిపేదని.. ఆదివారాల్లో మాత్రం వచ్చేది కాదని.. ఐష్ బాధలు తనకు తెలుసునన్నారు. పలుసార్లు అభిషేక్ వచ్చి బృందాను కలిసి వెళ్లేవాడని చెప్పారు. అయితే, విడాకుల అంశంపై ఐశ్వర్య ఎప్పుడూ మాట్లాడలేదని.. ఎప్పుడూ స్పందించరని స్పష్టం చేశారు. ఐశ్వర్య ఎల్లప్పుడూ తన గౌరవాన్ని కాపాడుకుంటుందని కక్కర్ చెప్పుకొచ్చారు.