Anjali | గ్లోబల్ స్టార్ రాంచరణ్ (Ram Charan) టైటిల్ రోల్లో నటిస్తోన్న ప్రాజెక్ట్ గేమ్‌ఛేంజర్ (Game Changer). శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ, రాజోలు భామ అంజలి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. గేమ్ ఛేంజర్ జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో చిట్ చాట్ చేసింది అంజలి. గేమ్ ఛేంజర్ సినిమా విశేషాలు అంజలి మాటల్లోనే..
మీ పాత్ర కోసం ఎలా ప్రిపర్ అయ్యారు..?
పార్వతి పాత్ర కోసం ప్రత్యేకం ఏం ప్రిపేర్ కాలేదు. పాత్ర సస్పెన్స్, ట్విస్టులతో సర్ప్రైజింగ్గా ఉండాలని శంకర్ సార్ కోరుకున్నారు. అందుకే నేను ఎక్కువగా ఆలోచించడం లేదా చెప్పడం మానేశాను. బిగ్ స్క్రీన్‌పై ప్రేక్షకులు తాజా అనుభూతి పొందుతారు. సినిమా పూర్తి చేసిన తర్వాత కూడా ఆ పాత్ర చాలా రోజులపాటు నాతోనే ఉండిపోయింది.
ఈ పాత్ర కోసం ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు..?
ఈ పాత్ర ప్రపంచం, అనుభవం నాకు పూర్తిగా కొత్తది. నటులుగా నిజజీవిత పరిస్థితులను ఉదాహరణగా తీసుకుంటాం. కానీ పార్వతి పాత్ర కోసం ఎలాంటి రెఫరెన్స్ తీసుకోలేదు. నా పాత్ర ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉండేందుకు చాలా కృషి చేయాల్సి వచ్చింది.
అప్పన్న క్యారెక్టర్ మీ ప్రయాణం గురించి..
శంకర్ సార్ ఇచ్చిన ఇన్పుట్స్ నా పాత్రను అర్థం చేసుకునేందుకు చాలా ఉపయోగపడ్డాయి. అయితే టీజర్, ట్రైలర్లో కావాలనే ఈ విషయాన్ని రివీల్ చేయలేదు. అప్పన్న, పార్వతి అనుబంధం సినిమాకు మెయిన్ హైలెట్‌గా నిలువబోతుంది. ప్రేక్షకులు ఖచ్చితంగా వాళ్లిద్దరి కథతో ప్రేమలో పడతారు.
ఈ సినిమా మీ లైఫ్‌కు గేమ్ ఛేంజర్ అవుతుందా..?
గేమ్ ఛేంజర్ నాకు చాలా నేర్పించింది. నటనతోపాటు జీవితంపై నా దృక్పథాన్ని మార్చేసింది. పాత్రలు, ప్రాజెక్టులను చాలా జాగ్రత్తగా ఎంపిక చేసేలా చేసింది. చిరంజీవి నా యాక్టింగ్‌పై ప్రశంసలు కురిపించడం నేనందుకున్న అతిపెద్ద అవార్డ్.
రాంచరణ్‌తో సాంగ్ గురించి ఏం చెప్తారు..?
ప్రీ రిలీజ్ ఈవెంట్లో అరుగు మీద సాంగ్‌ను విడుదల చేశాం. ఇప్పటికే చాలా రీల్స్ ట్రెండింగ్ అవుతున్నాయి. ఇది టీం ఫేవరేట్ సాంగ్ మాత్రమే కాదు.. నాకిష్టమైన వాటిల్లో ఒకటి. థమన్ ఖాతాలో ఇప్పటివరకున్న చాలా హిట్ సాంగ్స్లాగే ఇది కూడా చాలా కాలం ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది.
సంక్రాంతికి మీ రెండు సినిమాలు విడుదలవుతుండటం ఎలా అనిపిస్తుంది..?
సంక్రాంతికి విడుదలవడం ఏ యాక్టర్‌కైనా ఆశీస్సులాంటిది. తెలుగులో గేమ్ ఛేంజర్, తమిళంలో విశాల్ సినిమా ఉంది. రెండు సినిమాలు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంటాయని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నా.
Game Changer | గేమ్ ఛేంజర్‌లో ఈవెంట్లో విషాదం.. రూ.10 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించిన దిల్ రాజు
Nara Brahmani | మణిరత్నం సినిమాకి బాలకృష్ణ కూతురు ఎందుకు నో చెప్పిందంటే.?