Mega star chiranjeevi | చాలా రోజులుగా సినీ ఇండస్ట్రీలో ఉన్న సమస్యల గురించి ఏపీ ముఖ్యమంత్రి జగన్కు చెప్పాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు కానీ ఇప్పటి వరకు అది కుదర్లేదు. మధ్యలో మీటింగ్స్ జరిగినా.. అది ఏపీ సీఎంతో పాటు మంత్రులతో మాత్రమే జరిగాయి. ఇప్పుడు ఎట్టకేలకు పండగ పూట ఏపీ సీఎం జగన్ స్వయంగా తనకు తానుగా చిరంజీవిని పిలిపించుకున్నారు. ఈ సమావేశం సంతృప్తిగా జరిగిందని మెగాస్టార్ చెప్పాడు. గత ఏప్రిల్ నుంచి సినిమా ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య నెలకొన్న కొన్ని తర్జనభర్జనలకు సమాధానం త్వరలోనే దొరుకుతుందని చెప్పాడు మెగాస్టార్ చిరంజీవి. సామాన్య ప్రజలకు వినోదం అందుబాటులో ఉండాలన్న జగన్ ప్రయత్నాన్ని అభినందిస్తున్నానని అన్నారు. అలాగే జగన్ తీసుకున్న నిర్ణయాలతో సినీ ఇండస్ట్రీ ఎదుర్కొనే పరిస్థితులను కూడా జగన్కు వివరించినట్లు వెల్లడించారు.
అయితే సినిమా టికెట్స్ విషయంపైనే ముఖ్యంగా అంతా చర్చించుకున్నారు. అసలు ఈ విషయం గురించి జగన్ ఏం అన్నాడు అనేది అందరికీ కావాలి. కానీ దీనిపై ఏపీ సీఎం ఏదీ తేల్చి చెప్పలేదని చిరంజీవి చెప్పాడు. టికెట్ ధరలు తగ్గిస్తారా పెంచుతారా అనేదానిపై స్పష్టంగా చెప్పలేనని.. కానీ అందరికీ న్యాయం జరుగుతుందని మాత్రం జగన్ చెప్పినట్లు చిరు తెలిపాడు. అన్నివర్గాల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు చిరంజీవి వెల్లడించాడు. ఇండస్ట్రీలో బయటకు కనిపించేంత గ్లామర్ లేదని.. ఇక్కడ రెక్కాడితేగానీ డొక్కాడని కార్మికులు ఉంటారని.. వాళ్ల పరిస్థితి గురించి కాస్త ఆలోచించాలని జగన్ను విజ్ఞప్తి చేసినట్లు చిరు చెప్పాడు. ఈ సమస్యలపై తాను చేసిన నిర్మాణాత్మక సూచనలపై జగన్ సానుకూలంగా స్పందించినట్లు మెగాస్టార్ తెలిపారు. అయితే అన్నీ ఆలోచనలో ఉన్నట్లే మాట్లాడాడు కానీ ఒక్కటి కూడా స్పష్టమైన హామీతో మీటింగ్ నుంచి బయటకు రాలేదు చిరంజీవి. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని.. ఎవరూ భయపడవద్దని జగన్ భరోసా ఇచ్చినట్లు చెప్పాడు కానీ మీరు ధైర్యంగా ఉండండి.. నేనున్నాను మీకు.. ముందులాగే ఇండస్ట్రీ ఉంటుందనే హామీలు మాత్రం జగన్ ఇవ్వలేదు. అయితే సినిమా టికెట్ల ధరలపై వస్తున్న అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని జీవోలో మార్పులు చేసే విధంగా నిర్ణయం తీసుకుంటామని మాత్రం జగన్ చెప్పినట్లు తెలిపాడు చిరు. అన్నీ ఆలోచనలు మాత్రమే జరుగుతున్నాయి.. వాటికి కార్యరూపం మాత్రం ఇప్పటికీ రాలేదు. మొత్తానికి చిరంజీవితో జగన్ మీటింగ్ కర్ర విరగలేదు.. పాము చావలేదు అన్న చందాన సాగిందని చెప్తున్నారు విశ్లేషకులు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పెద్దగా కాదు.. ఒక బిడ్డగా చెప్తున్నా.. అందరూ సంయమనం పాటించండి : చిరంజీవి
సీఎం జగన్తో చిరంజీవి భేటీపై నాగార్జున స్పందన..
అందుకే విడాకులు తీసుకున్నాం.. సమంతతో విడాకులపై తొలిసారి స్పందించిన చైతూ – వీడియో
ఏపీ సీఎం జగన్తో ముగిసిన చిరంజీవి సమావేశం