Anushka shetty | తన అందం, అభినయం, టాలెంట్‌తో దక్షిణాదిలో వన్ ఆఫ్ ది లీడింగ్‌గా మారిపోయింది అనుష్కా శెట్టి (Anushka Shetty). గ్లామరస్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించాలంటే తల్లిదండ్రుల సపోర్ట్ ఖచ్చితంగా ఉండాల్సిందే. తన కెరీర్లో ఉన్నతస్థాయికి చేరుకునేందుకు పూర్తి సహకారం అందించిన ప్రముఖ వ్యక్తికి అనుష్క పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనుకుంటున్నారా..? ఆయనే అనుష్క తండ్రి విఠల్ శెట్టి (AN Vithal Shetty). ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న నాన్న విఠల్ శెట్టికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసింది స్వీటీ.
అనుష్క తల్లి, ఇతర కుటుంబసభ్యులతో కలిసి తండ్రి విఠల్శెట్టికి ఆప్యాయంగా ముద్దుపెడుతున్న ఫొటోను షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే పప్పా.. అని ట్వీట్ చేసింది. ఇప్పుడీ ఫొటో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. గ్లామరస్ పాత్రల్లో అందాల ఆరబోస్తూనే.. మరోవైపు పర్ఫార్మెన్స్ ఓరియెంట్ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో రికార్డుల వర్షం కురిపించింది. అరుంధతి, భాగమతి, బాహుబలి చిత్రాలతో ఇండస్ట్రీని షేక్ చేసిన స్వీటీ.. సినిమాలకు గ్యాప్ తీసుకుంది. ఆ తర్వాత నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయింది. ప్రస్తుతం
అనుష్కా శెట్టి ప్రస్తుతం నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) తో కలిసి Miss శెట్టి మిస్టర్ Polishetty (Miss Shetty Mr Polishetty) సినిమాలో నటిస్తోంది. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పీ మహేశ్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నవీన్ పొలిశెట్టి 20 ఏండ్ల యువకుడి పాత్రలో కనిపించనుండగా.. అనుష్క 40 ఏండ్ల మహిళగా కనిపించబోతుంది.
Happpuest bday papaluuuuuuu 🥳 pic.twitter.com/6dXjIJAbjg
— Anushka Shetty (@MsAnushkaShetty) April 20, 2023
నోనోనో లిరికల్ సాంగ్..