ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 16, 2020 , 14:59:17

అనుష్కశర్మ హెల్త్‌ సీక్రెట్‌ ఏంటో తెలుసా?

అనుష్కశర్మ హెల్త్‌ సీక్రెట్‌ ఏంటో తెలుసా?

ముంబై: అభిమానులకు ఇన్‌స్టాగ్రాం ద్వారా తన దినచర్యను ఎప్పటికప్పుడు పంచుకునే బాలీవుడ్‌ అందాల భామ, క్రికెటర్‌ విరాట్‌కొహ్లీ భార్య అనుష్కశర్మ తన హెల్త్‌ సీక్రెట్‌ను బయటపెట్టింది. ఆమె ప్రతిరోజూ ఉదయం లేవగానే పురాతన ఆయుర్వేద పద్ధతి అయిన ఆయిల్‌ పుల్లింగ్‌ను పాటిస్తుందట.  తన పెంపుడు కుక్కతో కలిసి ఆయిల్‌ పుల్లింగ్‌ చేస్తున్న వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రాంలో పంచుకుంది

‘నా ప్రియమైన స్మూష్ డాగ్‌డ్యూడ్‌తో కలిసి ఆయిల్‌ పుల్లింగ్‌ చేయడం నాకు ప్రతిరోజూ అలవాటు. ఇది పురాతన ఆయుర్వేద కర్మ. దీన్నే కవాలా లేదా గుండుషా అని పిలుస్తారు. ఖాళీ కడుపుతో కొద్దిగా నూనెను నోట్లోకి తీసుకొని కొన్ని నిమిషాలు పుకిలించి ఉమ్మివేయాలి.’ అని అనుష్కశర్మ తన ఫొటోకు క్యాప్షన్‌ ఇచ్చింది. ఆయిల్‌ పుల్లింగ్‌ వల్ల దంతాలు పరిశుభ్రంగా మారడంతోపాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, విషవాయువులను బయటకు పంపిస్తుందని ఈ ఆయుర్వేద ప్రక్రియ లాభాలను కూడా వివరించింది. ‘కొవిడ్‌ నేపథ్యంలో అందరూ ఆరోగ్యంపై దృష్టిపెట్టారు. రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు చూస్తున్నారు. ఈ ఆయుర్వేద చిట్కా కూడా మీకు పనికొస్తుందని ఆశిస్తున్నా.’ అని పేర్కొంది.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo