Anushka Sharma : ఇంట్లో వండిన ఆహారాన్ని అమితంగా ఇష్టపడే నటుల్లో బాలీవుడ్ భామ అనుష్క శర్మ ముందువరసలో ఉంటారు. తన తల్లి వండివార్చిన ఏ ఆహార పదార్ధాలయినా ఆమె ఇష్టంగా ఆరగిస్తారు. లండన్‌లో కుటుంబంతో గడిపిన అనంతరం అనుష్క ముంబై తిరిగివచ్చారు. బ్లూ క్రాప్ షర్ట్, బ్రైట్ రెడ్ ట్రౌజర్స్‌తో అనుష్క ఓ ఈవెంట్‌కు హాజరయ్యారు.
ఆపై ఫ్యాన్స్, మీడియాతో తిరిగి కనెక్ట్ అవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అకాయ్ కోహ్లికి జన్మనివ్వడం నుంచి కాలేజ్ మెమరీల వరకూ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ నుంచి ఎదురైన ఎన్నో ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఆమె కంఫర్ట్ ఫుడ్‌లో సూప్ తప్పకుండా ఉంటుందని చెప్పుకొచ్చారు. బాల్యంలో తన తల్లి వంటకాలను ఇష్టంగా తినేవారమని అన్నారు. తాను దిగులుగా ఉన్నప్పుడు ఒకే ప్లేట్లో పప్పనం, ఆలూ సబ్జీ తీసుకుంటానని చెప్పారు.
ఈ సింపుల్ ఫుడ్ తనకు ఇష్టమని చెప్పుకొచ్చారు. ఇక ఈవెంట్‌కు అటెంట్ అయిన తర్వాత ఇన్‌స్టాగ్రాంలో తన అవుట్‌ఫిట్ ఫొటోలను ఆమె షేర్ చేశారు. హ్యాపీ గో రెడ్-వై అని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఇక అనుష్క శర్మ, విరాట్ కోహ్లి స్వచ్ఛమైన దేశీ ఆహారానికి ప్రాధాన్యత ఇస్తారనే విషయం తెలిసిందే. కాగా ఓసారి విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ తమను డిన్నర్‌కు ఆహ్వానించారని, అయితే తాము సాయంత్రం 6 గంటలకు డిన్నర్ పూర్తి చేసి 9.30కి నిద్రిస్తామని కత్రినాతో చెప్పానని అంతకుముందు ఓ ఇంటర్వ్యూలో అనుష్క శర్మ చెప్పారు.
Read More :
Sabitha Indra Reddy | మీరు కేసీఆర్ సార్‌తోనే ఉండండి.. సబితక్కకు ఓ యువకుడి రిక్వెస్ట్.. వీడియో