Preminchoddu Trailer | అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస లీడ్ రోల్స్‌లో నటిస్తోన్న చిత్రం ‘ప్రేమించొద్దు’. బస్తీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రాన్ని శిరిన్ శ్రీరామ్ స్వీయ దర్శకత్వంలో శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నిర్మించగా.. తెలుగు వెర్షన్‌ని జూన్ 7న విడుదల చేస్తున్నారు. అనంతరం మిగిలిన భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్,పోస్టర్, సాంగ్స్‌తో సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. తెలిసీ తెలియని వయసులో ప్రేమించొద్దు అనే కాన్సెప్ట్‌తో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించినట్టు ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. స్కూల్, కాలేజ్ ఏజ్ లవ్ స్టోరీలు, ప్రేమ అంటూ చదువుల్ని నిర్లక్ష్యం చేయడం, తెలిసీ తెలియని వయసులో ప్రేమిస్తే ఎదురయ్యే పరిణామాలను చూపించారు. కాగా మరోవైపు నీ జతే చేరితే లిరికల్ వీడియో సాంగ్‌ను రేపు ఉదయం 11 గంటలకు లాంఛ్ చేయనున్నారు.
ఈ మూవీలో యశ్వంత్ పెండ్యాల, సంతోషి తాళ్ల, సోనాలి గర్జె, లహరి జులురి, శ్రద్ధా సాయి, వల్లీ శ్రీగాయత్రి, లక్ష్మీకాంత్ దేవ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రచన, ఎడిటింగ్, నిర్మాత, దర్శత్వం – శిరిన్ శ్రీరామ్ కాగా.. జునైద్ కుమార్ మ్యూజిక్, కమ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.
ప్రేమించొద్దు ట్రైలర్..
Stay tuned to experience the thrill and Rhythm of #NeJatheCherithey from the movie #Preminchoddu 🎬🔥
Song name: Nee Jathe Cherithey
🎵: Chaitanya Sravanthi
✍🏼: Sri Sai Kiran
🎤: Aniana Sowmya#Preminchoddu #NeJatheCherithey #ShirinSriram #SriSaiKiran #ChaitanyaSravanthi… pic.twitter.com/uIAutcSZVl
— Mango Music (@MangoMusicLabel) June 3, 2024