‘సంగీత దర్శకుడిగా ఇరవైఏండ్లు పూర్తయ్యాయి. దాదాపు 50 సినిమాలకు స్వరాల్ని అందించాను. వాటిలో ఎన్నో అద్భుత విజయాలున్నాయి. బాలు, వేటూరి, సీతారామశాస్త్రి వంటి లెజెండ్స్‌తో పాటు ఎందరో అగ్ర దర్శకులతో పనిచేశాననే సంతృప్తి ఉంది’ అన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. ఆయన సంగీతాన్నందించిన తాజా చిత్రం ‘ఛాంపియన్’. రోషన్, అనస్వర రాజన్ జంటగా నటించిన ఈ చిత్రానికి ప్రదీప్ అద్వైతం దర్శకుడు. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ శనివారం విలేకరులతో సినిమా సంగీత విశేషాలను పంచుకున్నారు.