కథాంశాల ఎంపికలో కొత్తదనం, పాత్రలపరంగా వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ దక్షిణాదిలో తిరుగులేని ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది సాయిపల్లవి. ఈ ఏడాది ‘తండేల్’తో ప్రేక్షకుల్ని అలరించిందీ భామ. ప్రస్తుతం హిందీలో భారీ పౌరాణిక చిత్రం ‘రామాయణ’లో నటిస్తున్నది. తాజా సమాచారం ప్రకారం తెలుగులో ఈ అమ్మడు ఓ మహిళా ప్రధాన చిత్రంలో నటించబోతున్నట్లు తెలిసింది. గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని సమాచారం. బలమైన భావోద్వేగాలతో వెండితెరపై కథల్ని ఆవిష్కరిస్తుంటారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. సాయిపల్లవిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఓ అద్భుతమైన లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారట. ఇటీవలే సాయిపల్లవికి కథ వినిపించారని, ఆమె ఈ సినిమాకు సూత్రప్రాయంగా అంగీకరించిందని ఫిల్మ్‌నగర్ టాక్. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మించనుందని సమాచారం. అయితే ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే చిత్ర బృందం నుంచి అధికారి క ప్రకటన రావాల్సిందే.