Lockdown | ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను పలుకరించింది అనుపమ పరమేశ్వరన్. 2025లో డ్రాగన్, పరదా, కిష్కింధపురి, జేఎస్కే.. జానకి వీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, ది పెట్ డిటెక్టివ్, బైసన్ సినిమాలతో మంచి హిట్స్ అందుకుంది. అనుపమ పరమేశ్వరన్ నటించిన తమిళ చిత్రం లాక్డౌన్ (Lockdown).
ఏఆర్ జీవా డైరెక్ట్ చేసిన ఈ మూవీ 2024 జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. పలు కారణాలతో వాయిదా పడ్డది. ఫైనల్‌గా ఈ చిత్రం విడుదలకు రెడీ అయింది. మేకర్స్ కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న విడుదల చేస్తున్నట్టు తెలియజేస్తూ కొత్త లుక్ షేర్ చేశారు. అనుపమ పరమేశ్వరన్ చీకటి గదిలో దిగాలుగా పడుకున్న స్టిల్‌తోపాటు ఏదో తెలియని బాధలో, ఆలోచనలో ఉన్నట్టుగా ఉన్న లుక్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.
లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి కేఏ శక్తివేళ్ సినిమాటోగ్రఫర్. చార్లీ, నిరోషా, ప్రియా వెంకట్, లివింగ్ స్టన్, ఇందుమతి, రాజ్‌కుమార్, షామ్జి, లొల్లు సభా మారన్, వినాయక్ రాజ్, విధు, అభిరామి, రేవతి, సంజీవీ, ప్రియా గణేశ్, ఆశ ఇతర కీలక పాత్రల్లో నటించారు. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Andhra King Taluka | రామ్ పోతినేని ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ట్రైలర్ రిలీజ్
AnnaGaruVostaru | వా వాతియార్ తెలుగు టైటిల్ ఇదే.. హైప్ పెంచుతోన్న కార్తీ నయా లుక్