AnnaGaruVostaru | తమిళంతోపాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉన్న కోలీవుడ్ స్టార్ యాక్టర్లలో ఒకడు కార్తీ (Karthi). ఈ టాలెంటెడ్ యాక్టర్ లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం వా వాతియార్ (Vaa Vaathiyaar). నలన్ కుమారస్వామి దర్శకత్వం వహిస్తున్నాడు. ఉప్పెన ఫేం కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తుండగా.. సత్యరాజ్, రాజ్‌కిరణ్, జీఎం సుందర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రాన్ని డిసెంబర్లో తమిళంతోపాటు తెలుగులో కూడా విడుదల చేయనుండగా.. విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక కార్తీ సినిమాలకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంటుందని తెలిసిందే. తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ తెలుగు టైటిల్‌ను ఫిక్స్ చేసింది. ఈ చిత్రం తెలుగులో అన్నగారు వస్తారు టైటిల్‌తో రిలీజ్ కానుంది. కార్తీ ఖాకీ చొక్కాలో స్టైలిష్ రెడ్ గాగుల్స్ పెట్టుకుని డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్న పోస్టర్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
అన్నగారు వస్తారు చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. కార్తీ కెరీర్లో వన్ ఆఫ్ ది సూపర్ హిట్‌గా నిలిచిన ఆవారా చిత్రం నవంబర్ 22న తెలుగులో రీరిలీజ్ కాబోతుందని తెలిసిందే.

Shriya Saran | నటి పేరుతో నకిలీ వాట్సప్.. స్పందించిన శ్రియ
Jajikaya | అఖండ 2 నుంచి మాస్ సాంగ్ ‘జాజికాయ’ పాటను చూశారా.!
Andhra King Taluka | రామ్ పోతినేని ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ట్రైలర్ రిలీజ్