Deepika Padukone | బాలీవుడ్లో ఉన్న టాలెంటెడ్ భామల్లో టాప్‌లో ఉంటుంది దీపికాపదుకొనే. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది లీడింగ్ నటీమణుల్లో ఒకరిగా కొనసాగుతున్న ఈ భామ ప్రస్తుతం అల్లు అర్జున్, అట్లీ కాంబోలో వస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ AA22xA6లో హీరోయిన్గా నటిస్తోంది. ఈ బ్యూటీ ఇప్పటికే ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)లో కీలక పాత్ర పోషించిందని తెలిసిందే.
అయితే కల్కి సీక్వెల్లో కూడా దీపికాపదుకొనే నటించాల్సి ఉండగా.. ఈ సినిమా చేసేందుకు నో చెప్పింది. అంతేకాదు సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబోలో రానున్న స్పిరిట్‌లో కూడా దీపికాపదుకొనే పేరు ప్రముఖంగా వినిపించగా.. ఈ చిత్రాన్ని కూడా తిరస్కరించిందని వార్తలు వచ్చాయి. అయితే ఈ రెండు భారీ బడ్జెట్ చిత్రాలే. మరి ఈ సినిమాలను తిరస్కరించడంపై దీపికాపదుకొనే క్లారిటీ ఇచ్చింది. తన నిర్ణయం పట్ల వస్తున్న నెగెటివ్ కామెంట్స్‌పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీపికాపదుకొనే స్పందించింది.
స్పిరిట్, కల్కి 2 సినిమాల నుంచి తప్పుకోవడానికి రెమ్యునరేషనో లేదంటే షెడ్యూలో కారణం కాదంది. అది రూ.100 కోట్ల సినిమానా..? రూ.500-600 కోట్ల సినిమానా అనేది కానే కాదంది దీపికాపదుకొనే. సినిమా (స్థాయి) రేంజ్ తన చాయిస్లపై ప్రభావం చూపించబోదని చెప్పకనే చెప్పింది దీపికాపదుకొనే.
కొన్నిసార్లు కొందరు పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తారు. అది చాలు అనుకుంటారు. కానీ అది కాదని చెప్పింది. ఆరోగ్యకరమైన పని వాతారణం ఉండాలని.. ప్రతీ రోజు ఎనిమిది గంటలు పనివేళలు సరిపోతాయంది. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఉత్తమంగా పనిచేస్తారని చెప్పుకొచ్చింది దీపికాపదుకొనే. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Shriya Saran | నటి పేరుతో నకిలీ వాట్సప్.. స్పందించిన శ్రియ
Jajikaya | అఖండ 2 నుంచి మాస్ సాంగ్ ‘జాజికాయ’ పాటను చూశారా.!
Andhra King Taluka | రామ్ పోతినేని ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ట్రైలర్ రిలీజ్