Parineeti Chopra and Raghav Chadha | బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్దా దంపతులు తమ ముద్దుల కొడుకు పేరును అధికారికంగా ప్రకటించారు. ఈ క్యూట్ కపుల్ తమ కుమారుడికి ‘నీర్’ (Neer) అని పేరు పెట్టారు. నీర్ అనేది సంస్కృత పదం అని తెలుస్తుంది. దీనికి జలం, స్వచ్ఛమైన, దైవత్వంతో నిండిన, అపరిమితమైనది అనే అర్థాలు ఉన్నాయి. పరిణీతి, రాఘవ్ చద్దా తమ సోషల్ మీడియా వేదికల్లో, కొడుకు పాదాలను ముద్దాడుతున్న ఆత్మీయమైన ఫోటోను పంచుకుంటూ ఆ పోస్ట్ కింద ఈ పేరును జతచేసి అధికారికంగా వెల్లడించారు. పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దాలకు గత అక్టోబర్ (2025)లో పండంటి మగబిడ్డ జన్మించిన విషయం తెలిసిందే.
“Jalasya rūpam, premasya svarūpam — tatra eva Neer.”
Our hearts found peace in an eternal drop of life. We named him ‘𝗡𝗲𝗲𝗿’ — pure, divine, limitless.
😚🧿🩵 pic.twitter.com/ElM4sywhUS
— Parineeti Chopra (@ParineetiChopra) November 19, 2025