Anu Emmanuel | మజ్ను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది యూనెటెడ్ స్టేట్స్ భామ అనూ ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel). ఆ తర్వాత గోపీచంద్, అల్లు అర్జున్, పవన్ కల్యాణ్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఈ భామ కొత్త సినిమాను ప్రకటించింది. పాపులర్ సినిమాటోగ్రఫర్ ఆండ్రీవ్ బాబు ఈ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ చిత్రంలో శివ కందుకూరి లీడ్ రోల్లో నటిస్తున్నాడు.
యూనిక్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ మూవీ షూటింగ్ లండన్‌లోని అందమైన లొకేషన్లలో కొనసాగుతోంది. రెండు స్టోరీ లైన్స్ ఆధారంగా కర్మ థీమ్‌తో సమాంతరంగా థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో సినిమా ఉండబోతున్నట్టు తెలియజేశారు మేకర్స్. విశేషం. బిగ్ మూవీ మేకర్స్ లిమిటెడ్, మై3 ఆర్ట్స్ బ్యానర్లపై లండన్ గణేశ్, డాక్టర్ ప్రవీణ్ రెడ్డి ఊట్ల నిర్మిస్తున్నారు. సితార ఫిలిమ్స్ లిమిటెడ్ ఈ చిత్రానికి లైన్ ప్రొడక్షన్ పనులు చూసుకోనుంది.
రామ్ నటించిన కందిరీగ, ఎందుకంటే ప్రేమంటే, సాయి దుర్గ తేజ్ నటించిన తేజ్ ఐ లవ్ యూ సినిమాలకు సినిమాటోగ్రఫర్‌గా పనిచేశాడు.
ఆండ్రీవ్ బాబు ఈ చిత్రానికి కెమెరామెన్‌గా కూడా పనిచేస్తుండటం విశేషం. గతేడాది రవితేజతో కలిసి నటించిన రావణాసుర బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. మరోవైపు కార్తీతో నటించిన జపాన్ కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తన ఆశలన్నీ కొత్త సినిమాపైనే పెట్టుకుంది. మరి అనూ ఇమ్మాన్యుయేల్ ఈ సినిమాతో అయినా సక్సెస్ అందుకుంటుందో చూడాలంటున్నారు సినీ జనాలు.
Here’s an exciting announcement for you all 📣🪃
Ace Cinematographer @iandrewdop makes his Directional Debut with @ItsAnuEmmanuel and @iam_shiva9696 as the leads💥
A spine-tingling thriller that explores karma in a way you’ve never seen before ❤️🔥
The shoot is currently… pic.twitter.com/ASl7bYtgzk
— BA Raju’s Team (@baraju_SuperHit) October 23, 2024
War 2 | హృతిక్ రోషన్ వర్సెస్ తారక్ .. వార్ 2లో అదిరిపోయే కత్తిసాము సీక్వెన్స్