Anshu | అక్కినేని నాగార్జున నటించిన మన్మథుడు సినిమాతో హీరోయిన్గా సూపర్ ఫేం సంపాదించింది అన్షు. ఈ భామ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగు సినిమాలో నటిస్తుందని తెలిసిందే. టాలీవుడ్ యాక్టర్ సందీప్ కిషన్ (Sundeep Kishan) ధమాకా ఫేం త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం మజాకా (Mazaka). ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తుండగా.. రావు రమేశ్, అన్షు మరో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజాగా అన్షుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మూవీ లుక్ ఒకటి విడుదల చేశారు మేకర్స్. ఇందులో అన్షును స్టైలిష్ గాగుల్స్ పెట్టుకున్న పెళ్లికూతురు గెటప్‌లో చూడొచ్చు. ఈ లుక్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది.
మాస్ ఎంటర్టైనర్గా వస్తోన్న మజాకా ఫిబ్రవరి 21న విడుదల కానుంది. ఈ మూవీని ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదల చేసిన మజాకా టైటిల్, ఫస్ట్ లుక్‌లో సందీప్ కిషన్ పంచె కట్టులో సరికొత్తగా కనిపిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాడు.
ఇటీవలే విడుదల చేసిన బ్యాచిలర్స్ ఆంథెమ్ సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది. ఇక హీరోహీరోయిన్లు స్టేషన్లో ఉన్న సీన్లతో మొదలైన టీజర్.. అక్కడ పోసుకున్నది బీరు కాదండి.. నా ఉసురు అని సందీప్ కిషన్ అంటుంటే.. నాకు తెలియక అడుగుతున్నాను బీర్ బెటరా.. విస్కీ బెటరా అని అడుగుతోంది రీతూవర్మ. దీనికి రకుల్ బెటరా.. రెజీనా బెటరా అంటే ఏం చెప్తానండీ అంటూ రీతూ వర్మ డైలాగ్స్‌తో సినిమా ఫన్ ఎలిమెంట్స్‌తో సాగనున్నట్టు క్లారిటీ ఇచ్చేసింది.
Wishing the ever-gorgeous @AnshuActress a very Happy Birthday
– #Mazaka #HappyBirthdayAnshu#SK30 #MazakaOnFeb21st pic.twitter.com/5gfua4XPEc
— Suresh PRO (@SureshPRO_) January 31, 2025
Kamal haasan | విక్రమ్ 2 కాదు.. మరొక కొత్త స్క్రిప్ట్ రాశా.. కమల్ హాసన్ ఆసక్తికర కామెంట్స్
Ram Gopal Varma | సిండికేట్‌పై వర్క్ చేస్తున్నా.. కానీ ఆ వార్తలు అబద్ధం.. పుకార్లపై రాంగోపాల్ వర్మ