గత కొంతకాలంగా టాలీవుడ్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్న వార్త రవితేజ (Ravi Teja)-చిరు (Chiranjeevi) కాంబినేషన్. ఈ ఇద్దరూ బాబీ (కేఎస్ రవీంద్ర) డైరెక్షన్లో రాబోతున్న సినిమాతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి క్రేజీ అప్ డేట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. బ్లాక్ బాస్టర్ చిత్రం అన్నయ్య (Annayya) సీన్ మళ్లీ రిపీట్ కానుందట. ఈ చిత్రంలో చిరంజీవికి తమ్ముళ్లలో ఒకడిగా నటించాడు రవితేజ.
‘అన్నయ్య’ చిత్రంలో చిరు-రవితేజ కాంబోలో వచ్చే సీన్లు ప్రేక్షకులను ఫుల్ ఎంటర్ టైన్ చేస్తాయి. ఇపుడు మరోసారి రవితేజ చిరంజీవి సోదరుడి పాత్రలో కనిపించనున్నాడని జోరుగా టాక్ నడుస్తోంది. కథానుగుణంగా రవితేజ మధ్యవయస్కుడైన వ్యక్తి పాత్రలో కనిపించనుండగా..తన భార్యాపిల్లలతో కలిసి శ్రీలంకలో నివసిస్తాడట. అయితే దీనికి సంబంధించి ప్రొడక్షన్ హౌస్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ క్రేజీ న్యూస్‌పై బాబీ టీం నుంచి ఏదైనా ప్రకటన వస్తుందేమో చూడాలంటున్నారు సినీ జనాలు.
చిరు సినిమా కోసం రవితేజ 16 రోజులు డేట్స్ ఇచ్చినట్టు ఇప్పటికే వార్తలు తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం శరత్ మండవ డైరెక్షన్లో రామారావు ఆన్ డ్యూటీ చేస్తున్నాడు రవితేజ. ఈ చిత్రం జులై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో ఎమ్మార్వోగా కనిపించనున్నాడు మాస్ మహారాజా.