Anirudh Ravichander | తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటిస్తోన్న తాజా చిత్రం వెట్టైయాన్ (Vettaiyan). జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ (TJ Gnanavel) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దుషారా విజయన్, రితికా సింగ్ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil), మంజు వారియర్, రానా దగ్గుబాటి, రావు రమేశ్, రోహిణి మొల్లేటి కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్.
కాగా వెట్టైయాన్ నుంచి ఎగ్జైటింగ్ న్యూస్ షేర్ చేశాడు అనిరుధ్. వెట్టైయాన్ నుంచి Manasilayo (HunterVantaar) సాంగ్‌ను త్వరలోనే విడుదల చేస్తున్నట్టు ట్వీట్ చేశాడు అనిరుధ్. ఇప్పటికే షూట్ టైంలో సూపర్ స్టార్లు అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, ఫహద్ ఫాసిల్ ఒకే ఫ్రేమ్‌లో మెరిసిన స్టిల్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ముగ్గురు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. వెట్టైయాన్ నుంచి ఫహద్ ఫాసిల్ కాలేజ్ స్టూడెంట్‌లా బ్యాగ్ వేసుకొని హాయ్ చెప్తున్నట్టు ఉన్న పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
మరోవైపు వెట్టైయాన్ టైటిల్ టీజర్ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం అక్టోబర్ 10న థియేటర్లలో గ్రాండ్‌గా సందడి చేయనుంది. రజినీకాంత్ మరోవైపు తలైవా 171గా తెరకెక్కుతున్న కూలి చిత్రంలో కూడా నటిస్తున్నాడు.
#Manasilayo #Vettaiyan song comin soon 🥁👑🙏🏻#HunterVantaar
— Anirudh Ravichander (@anirudhofficial) August 20, 2024
Yuvaraj Singh | తెరపైకి క్రికెటర్ యువరాజ్ సింగ్ బయోపిక్.. వివరాలివే
SDGM | మాస్ ఫీస్ట్ పక్కా.. గోపీచంద్ మలినేని ఎస్డీజీఎంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్..!
VidaaMuyarchi | అజిత్ కుమార్ విదాముయార్చి రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రెండింగ్‌లో పోస్టర్
Harish Shankar | త్రివిక్రమ్‌పై నాన్న చూపించే ప్రేమ చిరాకు తెప్పిస్తుంది : హరీష్ శంకర్
Vettaiyan టైటిల్ టీజర్..