Spirit | అర్జున్ రెడ్డి సినిమాతో ఎంట్రీలోనే బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. యానిమల్తో రికార్డులు క్రియేట్ చేసిన ఈ క్రేజీ డైరెక్టర్ ప్రస్తుతం ప్రభాస్‌తో స్పిరిట్ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూ అభిమానులు, మూవీ లవర్స్‌లో హైప్ పెంచేస్తుంది. సందీప్ రెడ్డి వంగా సినిమాలో అవకాశం వచ్చిందంటే పాత్ర ఎంత చిన్నదైనా సరే క్రేజ్ మాత్రం అమాంతం పెరిగిపోతుంది.
సరైన సినిమాలు లేక ప్రొఫెషనల్‌గా కెరీర్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్‌ను సిల్వర్ స్క్రీన్‌పై యానిమల్‌లో పవర్ ఫుల్ పాత్రలో ప్రజెంట్ చేసి గ్రాండ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగా. బాబీ డియోల్‌కు యానిమల్ యాక్టర్‌గా మరోసారి ప్రాణం పోసిందని చెప్పొచ్చు. ఇక సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ కోసం మరో బాలీవుడ్ యాక్టర్‌ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడన్న వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. ఈ యాక్టర్ కూడా చాలా కాలంగా మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతకీ ఆ నటుడెవరనే కదా మీ డౌటు.
రక్త చరిత్ర, వినయ విధేయ రామ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పాడువివేక్ ఒబెరాయ్. ఆ టాలెంటెడ్ యాక్టర్ అడపాదడపా సినిమాలు చేసినా చెప్పుకోదగ్గ బ్రేక్ ఇవ్వలేకపోయాయి. వివేక్ ఒబెరాయ్ స్పిరిట్‌లో తీసుకునేందుకు సందీప్ రెడ్డి వంగా ప్లాన్ చేస్తున్నాడట.
తాజా టాక్ ప్రకారం ఇందులో వివేక్ ఒబెరాయ్‌ను నెగెటివ్ రోల్లో చూపించబోతున్నాడు. వివేక్ ఒబెరాయ్ స్పిరిట్ టీంతో జాయిన్ అవుతున్నాడన్న వార్తలపై అధికారిక ప్రకటన ఏం రాకున్నా.. ప్రస్తుతానికి ఈ గాసిప్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మూవీ లవర్స్. ఇక అప్పుడే సిల్వర్ స్క్రీన్‌పై ప్రభాస్-వివేక్ ఒబెరాయ్ కాంబో ఎలా ఉంటుందా..? అని ఊహించుకోవడం మొదలుపెట్టేశారు. యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలుభారీగానే ఉన్నాయి.
Kayadu Lohar | ఆ సినిమాకు నా హృదయంలో ప్రత్యేక స్థానం.. తెలుగు మూవీపై కయాదు లోహర్