Actress Sindhu | సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు అంటే వాళ్లకు డబ్బులకు కొదవ ఉండదని
అనుకుంటుంటారు చాలా మంది. తరచూ షూటింగ్స్ చేస్తూ రూ.కోట్లకు కోట్లు సంపాదిస్తుంటారని
అనుకుంటారు. అయితే, రంగుల ప్రపంచంలోకి వెళ్లిన ప్రతీ ఒక్కరూ కోటీశ్వరులు కావడమనేది కలే. ఏళ్ల
తరబడి చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న చాలా మంది నటీనటులు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ప్రస్తుతం దుర్భరమైన
జీవితం గడుపుతున్నారు. మూడు పూటలా తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యం బారిన పడితే ఆసుపత్రికి వెళ్ల లేని దీనస్థితిలో జీవితం నెట్టుకొస్తున్నారు. అలా ఓ నటి అనారోగ్యం బారిన పడి.. వైద్యానికి కూడా డబ్బులేక ప్రాణాలు కోల్పోయింది.
తమిళ సినిమా ‘అంగడి తెరు’ (Angadi Theru) (తెలుగులో ‘షాపింగ్ మాల్’) చిత్రంలో నటించిన సింధు
(Sindhu) అనారోగ్యం కారణంగా సోమవారం ఉదయం ప్రాణాలు కోల్పోయింది. ఆమె వయసు ప్రస్తుతం
42 ఏళ్లు. గత కొన్ని రోజులుగా బ్రెస్ట్ క్యాన్సర్ (Breast Cancer)తో బాధపడుతున్న సింధు.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇంటి వద్దనే చికిత్స తీసుకుంటోంది. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించడంతో తప్పని సరి పరిస్థితుల్లో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. అయితే చికిత్సకు డబ్బు లేక మెరుగైన వైద్యం పొందలేకపోయింది. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఆరోగ్యం మరింత క్షీణించి ప్రాణాలు కోల్పోయింది. సింధు మృతి గురించి తెలుసుకున్న తోటి నటీనటులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలుపుతున్నారు.
Also Read..
Samantha | గాయని చిన్మయి పిల్లలతో సమంత ఆటలు
Spandana Raghavendra | హాలీడే వెకేషన్లో విషాదం.. పాపులర్ యాక్టర్ సతీమణి మృతి
Jawan Movie | వీర లెవల్లో షారుఖ్ లుక్.. జవాన్ నుంచి అదిరిపోయే పోస్టర్ రిలీజ్..!