Spandana Raghavendra | పాపులర్ కన్నడ యాక్టర్, బిగ్ బాస్ కన్నడ సీజన్ 1 విన్నర్ విజయ్ రాఘవేంద్ర (Vijay Raghavendra) ఇంట విషాదం చోటు చేసుకుంది. విజయ్ రాఘవేంద్ర సతీమణి స్పందన (Spandana Raghavendra) సోమవారం ఉదయం బ్యాంకాక్‌లో కన్నుమూశారు. స్పందన లోబీపీ కారణంగా గుండెపోటు (Heart attack) రావడంతో తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోంది.
ఈ ఘటన జరిగిన సమయంలో స్పందన తన స్నేహితులు, ఫ్యామిలీతో కలిసి థాయ్‌లాండ్ హాలీడే వెకేషన్లో ఉంది. ఈ వార్త విన్న వెంటనే విజయ్ రాఘవేంద్ర ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. విజయ్ రాఘవేంద్ర ప్రస్తుతం తన అప్‌కమింగ్ సినిమా ప్రమోషన్స్‌లో బెంగళూరులో బిజీగా ఉన్నాడు. స్పందన భౌతికకాయాన్ని బెంగళూరుకు తీసుకొచ్చేందుకు ఆమె తండ్రీ, సోదరుడు బ్యాంకాక్‌కు బయలుదేరినట్టు సమాచారం. రేపు బెంగళూరులో స్పందన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
స్పందన 2016లో కన్నడ సినిమా అపూర్వలో చిన్న పాత్రలో నటించింది. అంతేకాదు నిర్మాతగా ఓ సినిమా కూడా తెరకెక్కించింది. విజయ్ రాఘవేంద్ర, స్పందన 2007లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి కుమారుడు,కుమార్తె ఉన్నారు. విజయ్ రాఘవేంద్ర కన్నడ స్టార్ హీరోలు శివరాజ్ కుమార్, రాఘవేంద్రరాజ్‌కుమార్, దివంగత పునీత్ రాజ్‌కుమార్ కజిన్ అవుతాడు.
ఈ నేపథ్యంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య సంతాప సందేశాన్ని అందరితో పంచుకున్నారు. ప్రముఖ కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన అకాల మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. స్పందన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. స్పందనను కోల్పోయిన విజయ రాఘవేంద్ర, బి.కె.శివరామ్ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు.