Samantha | గాయని చిన్మయి పిల్లలతో సమంత ఆటలు
Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha) ప్రస్తుతం వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తోంది. ఇటీవలే స్నేహితులతో కలిసి బాలి (Bali)ట్రిప్‌కు వెళ్లిన నటి.. అక్కడి నుంచి తిరిగి వచ్చేసింది. తాజాగా చెన్నైలోని తన స్నేహితురాలు, ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద (Chinmayi Sripaada) ఇంటికి వెళ్లింది. అక్కడ గాయని కవల పిల్లలతో ఆటలాడి సందడి చేసింది.
Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha) సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. మయోసైటిస్ (Myositis) తో బాదపడుతున్న సామ్.. ట్రీట్ మెంట్ కోసం కాస్త ప్రొఫెషనల్ నుంచి విరామం తీసుకుంది. ప్రస్తుతం వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తోంది. ఇటీవలే స్నేహితులతో కలిసి బాలి (Bali)ట్రిప్‌కు వెళ్లిన నటి.. అక్కడి నుంచి తిరిగి వచ్చేసింది. తాజాగా చెన్నైలోని తన స్నేహితురాలు, ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద (Chinmayi Sripaada) ఇంటికి వెళ్లింది. అక్కడ గాయని కవల పిల్లలతో ఆటలాడి సందడి చేసింది. వారితో ఆర్ఆర్ఆర్ (RRR) చిత్రంలోని నాటునాటు ( Naatu Naatu) పాటకు స్టెప్పులేయించింది. ఇందుకు సంబంధించిన వీడియోలను సమంత తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
సమంత చివరిసారిగా దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ లో కనిపించింది. అయితే, ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’ (Kushi) చిత్రంలో నటించింది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కానుంది. దీంతో పాటు ‘సిటాడెల్’ (Citadel)లో కూడా నటించింది. రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్‌లో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావణ్ తో కలిసి సామ్ స్క్రీన్ పంచుకుంది. ఈ వెబ్ సిరీస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read..
Rahul Gandhi | పార్లమెంట్ లో అడుగుపెట్టనున్న రాహుల్.. స్వీట్లను పంచి పెట్టిన మల్లికార్జున ఖర్గే
Ayodhya Ram Temple | అయోధ్య ఆలయం కోసం ప్రపంచంలోనే అతిపెద్ద తాళం తయారు చేసిన భక్తుడు
Rahul Gandhi | ఎంపీగా తిరిగి పార్లమెంట్ లో అడుగుపెట్టనున్న రాహుల్.. అనర్హతను ఎత్తివేసిన దిగువ సభ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

