anee master in Bigg boss 5 telugu | బిగ్‌బాస్ ఇంట్లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఊహించడం కష్టం. అంచనా వేయడం ఇంకా కష్టం. అప్పటివరకు నవ్వుకుంటూ మాట్లాడిన వారు ఒక్కసారిగా గొడవ పడతారు. దోస్త్ మేరా దోస్త్ అనే పాట పాడి వెంటనే నువ్వు నాకు ఫ్రెండ్ ఏంట్రా అంటారు. అంచనాలకు అందని బిగ్‌బాస్ హౌస్‌లో తాజాగా మరో విచిత్రం కూడా జరిగింది. ఈసారి కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా ఆరుగురు ఇంటి సభ్యులు పోటీ పడ్డారు. అందులో శ్రీరామ్, మానస్, సన్నీ చివరి వరకు నిలబడలేక మధ్యలోనే ఓడిపోయారు. షణ్ముఖ్ జస్వంత్ , సిరి హనుమంత్, ఆనీ మాస్టర్ టాప్ 3లోకి వచ్చారు. ఈవారం కెప్టెన్సీ కోసం ఈ ముగ్గురు పోటీ పడ్డారు. అప్పటి వరకూ సరదాగా ఉన్న ఈ గేమ్ కాస్త టాప్ 3 కి వచ్చిన తర్వాత సీరియస్ అయింది. ముఖ్యంగా ఆనీ మాస్టర్ మిగిలిన ఇంటి సభ్యులపై కోపంతో చిందులు తొక్కింది.
ఇంట్లో ఎవరూ సోలోగా ఆడటం లేదని.. ఒకరి కోసం ఒకరు ఆడుతున్నారని.. ఇండివిజువల్ గేమ్ ఆడటం పూర్తిగా మర్చిపోయారు అంటూ ఆనీ మాస్టర్ సీరియస్ అయింది. వ్యక్తిగతంగా ఎవరి ఆట వాళ్లు ఆడుకోవాలని బిగ్‌బాస్ పదేపదే చెబుతున్న కూడా ఇక్కడ ఎవరూ పట్టించుకోవడం లేదు అంటూ ఆమె ఆవేదన చెందింది. చివరికి కెప్టెన్సీ టాస్క్ లో కూడా ఒకరిని ఒకరు సపోర్టు చేసుకుంటూ పోతే.. సోలోగా ఆడేవాళ్లు ఏం చేయాలి అంటూ అరిచేసింది. ఈ క్రమంలోనే తనను టార్గెట్ చేసిన షణ్ముఖ్, సిరిపై కూడా సీరియస్ అయింది ఆనీ మాస్టర్ . కెప్టెన్సీ టాస్క్ నుంచి తనకు తానే సొంతంగా తప్పుకుంది. ఇలా తప్పుడు ఆటలు ఆడి కెప్టెన్ అవ్వడం తనకు ఇష్టం లేదు అంటూ చెప్పింది ఆనీ మాస్టర్ . మొత్తానికి ఈమె తీసుకొచ్చిన ఈ విషయం కచ్చితంగా ఈ వారాంతంలో నాగార్జున ముందుకు రావడం ఖాయం. అక్కడ ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Bigg boss 5 telugu | బిగ్ బాస్ 5 తెలుగులో కొత్త కెప్టెన్ ఎవరు.. రేషన్ మేనేజర్ ఎవరు..?
Anchor Ravi : నేను వెళ్లిపోతా బయటకు పంపండన్న రవి
siri hanumanth : సిరి-షణ్ముఖ్ వ్యవహారం శృతిమించుతున్నట్టుగా ఉందే..!
Bigg Boss 5 telugu : ఆరుబయట పడుకున్న హౌజ్‌మేట్స్.. !
Shanmukh jaswanth: అమ్మ నువ్వు క్యాన్సర్ జయించావు.. నేను ఈ బాధ నుండి బయటపడతా: షణ్ముఖ్