Anchor Anasuya Bharadwaj | తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ గ్లామరస్ అండ్ కాంట్రవర్షియల్ యాంకర్ ఎవరైనా ఉన్నారా అంటే అది అనసూయ మాత్రమే. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ కామెంట్స్ పోస్ట్ చేస్తూ అందరినీ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది ఈ జబర్దస్త్ యాంకర్. దానికి తోడు అదిరిపోయే ఫోటోషూట్లతో కూడా ఎప్పటికప్పుడు కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది అనసూయ. తాజాగా ఈమె పోస్ట్ చేసిన ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది. అది ఎవరిని ఉద్దేశించి చేసిందో అందరికీ అర్థమవుతుంది కానీ.. ఆమె మాత్రం పేరు పెట్టకుండా అరటిపండు వలచి నోట్లో పెట్టినట్టు ట్వీట్ చేసింది.
అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా!!#NotHappyOnsomeonesSadness but #FaithRestored
— Anasuya Bharadwaj (@anusuyakhasba) August 25, 2022
అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా.. #NotHappyOnsomeonesSadness but #FaithRestored
ఇదే తాజాగా అనసూయ చేసిన ట్వీట్. ఇందులో అమ్మను అన్న ఉసురు ఊరికే పోదు అని ఎవరిని అన్నది మాత్రం చెప్పలేదు అనసూయ. కాకపోతే ఐదేళ్ల కింద అర్జున్ రెడ్డి సినిమా సమయంలో విజయ్ దేవరకొండ, అనసూయ మధ్యలో పెద్ద రగడ జరిగింది. ఆ సినిమాలో అమ్మను తిడుతూ ఒక బూతు ఉంటుందని.. దాన్ని హైలైట్ చేయడం తనకు నచ్చలేదు అంటూ మీడియా ముందుకు వచ్చి హంగామా చేసింది అనసూయ. ఆ తర్వాత పరిస్థితులన్నీ సర్దుకున్నాయి. అయితే సడన్గా లైగర్ విడుదలైన కాసేపటికే అనసూయ ఈ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. పైగా ఈ సినిమాకు నెగిటివ్ టాక్ రావడం.. అనసూయ ఇలాంటి ట్వీట్ చేయడంతో ఇన్ డైరెక్ట్ గా విజయ్ దేవరకొండనే అనింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. అసలే సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చి బాధలో ఉన్న విజయ్ దేవరకొండను ఇలా పుండు మీద కారం జరిగినట్టు గెలకడం మంచిది కాదు అంటున్నారు నెటిజన్లు. కాగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మాత్రం అనసూయ మీద సీరియస్ అవుతున్నారు.
“Liger Movie Review | లైగర్ సినిమా రివ్యూ”