Liger Press Meet | ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘లైగర్’ ప్రమోషన్లతో బిజీగా గడుపుతున్నాడు. సౌత్ టూ నార్త్ వరకు ప్రెస్మీట్లను నిర్వహిస్తూ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేస్తున్నాడు. కాగా తాజాగా హైదరాబాద్‌లో విజయ్, అనన్యపాండే ప్రెస్‌మీట్ నిర్వహించిన విషయం తెలిసిందే. వీరిద్దరూ జర్నలిస్టులతో సినిమా విషయాలను ముచ్చటించారు. అయితే ఈ ప్రెస్మీట్లో విజయ్ ప్రవర్తనను తప్పుపడుతూ పలువురు విమర్శలు చేస్తున్నారు. అసలు విషయమేంటంటే హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్మీట్లో ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ విజయ్ టేబుల్‌పై రెండు కాళ్ళను పెట్టాడు. కాగా దీనిపై పలు వెబ్సైట్లు పాన్ ఇండియా హీరో అయ్యే సరికి పొగరు వచ్చిందని వార్తలు రాసారు. తాజాగా దీనిపై ఆ జర్నలిస్టు ఓ వీడియోలో స్పందించాడు.
Lets look @TheDeverakonda always creates a comfort zone to everyone around 💝 #LIGER #LigerOnAug25th @ananyapandayy #PuriJagannadh @karanjohar @Charmmeofficial @apoorvamehta18 @PuriConnects @DharmaMovies pic.twitter.com/L0CLuuvKEr
— Maduri Mattaiah (@madurimadhu1) August 19, 2022
ఆ వీడియోలో జర్నలిస్టు మాట్లాడుతూ ‘విజయ్ దేవరకొండను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఆయన మాతో చాలా సరదాగా ఉంటారు. ప్రెస్మీట్లో ఓ జర్నలిస్టు విజయ్ నటించిన టాక్సీవాలా రోజుల్ని గుర్తు చేస్తూ అప్పట్లో మీతో సరదాగా ముచ్చటించాం. ఇప్పుడు మీరు పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. దాంతో మీతో ఫ్రెండ్లీగా మాట్లాడాలంటే కాస్త బెరుకుగా ఉంది అని అనడంతో.. విజయ్ దానికి అవన్ని పట్టించుకోవద్దు సరదాగా మాట్లాడుకుందాం. మీరు కాలు మీద కాలు వేసుకొని కూర్చొండి. నేను కూడా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటా అని ఫ్రెండ్లీగా చెప్తూ అలా చేశాడు అంటూ జర్నలిస్టు వివరణ ఇచ్చాడు.
విజయ్ దేవరకొండ ప్రెస్ ముందు మిస్ బిహేవ్ చేశాడని తెలుగు సినిమా జర్నలిస్టులను అవమానించారని అతని ఫోటోని పెట్టి చాలామంది ట్రోల్ చేస్తున్నారు నిజానికి ఇదంతా ఒక సరదాగా జరిగిన పరిణామం మాత్రమే అందుకే మీ అందరికీ క్లారిటీ కోసం ఈ క్రింది వీడియో
@TheDeverakonda #Liger pic.twitter.com/DdSAkG2Bsw— Maduri Mattaiah (@madurimadhu1) August 19, 2022