విజయ్‌దేవరకొండ (Vijay Deverakonda) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం లైగర్ (Liger). పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఆగస్టు 25న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉంది విజయ్ టీం. ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒకవేళ లైగర్ ఫ్లాప్ అయితే మీరు ఎలా ఫీలవుతారని విజయ్ను ప్రశ్నించారు యాంకర్.
దీనికి విజయ్ స్పందిస్తూ..కొన్నాళ్ల క్రితం ఈ ప్రశ్న నన్ను అడిగితే నాకు చాలా కోపం వచ్చేది. కోపంతో సమాధానం చెప్పేవాడిని… కొన్ని రోజులుగా నాకు లభించిన ప్రేమ ఇటువంటి చిన్న విషయాలకు నేను కోపంగా స్పందిస్తే..కానీ కొన్ని రోజులుగా నాకు లభించిన ప్రేమ పట్ల అగౌరవంగా ఉంటుంది. నేను ప్రేమను గుర్తుంచుకోవాలనుకుంటున్నా. నాకు ప్రేక్షకులు చాలా ముఖ్యం. మేము ప్రేక్షకుల కోసం పని చేస్తాం. మేము కేవలం వారిని కలవడం కోసం పట్టణాలకు వెళ్తాం. మేమంతా ప్రేక్షకుల ప్రేమను గెలుచుకోవాలనుకుంటున్నామని చెప్పుకొచ్చాడు.
నేను డబ్బు కోసం..గౌరవం కోసం పోరాడాల్సి వచ్చింది. నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి, జాబ్ సంపాదించుకునేందుకు పోరాటం చేయాల్సి వచ్చింది. ప్రతీ సినిమా ఒక పోరాటం.. నా తొలి సినిమాకి నిర్మాత లేరు. మేము సినిమాని నిర్మించడానికి డబ్బు జమ చేశాం. ప్రేక్షకుల అభిమానాన్ని పొందేందుకు ఉచితంగా పని చేశాం. సినిమా విడుదల చేసే వ్యక్తులు కూడా మాకు దొరకలేదు. మేమెవరమో ఎవరికీ తెలియకపోవడం వల్ల విడుదలకు మాకు నెలల సమయం పట్టింది. కానీ సినిమా పెద్ద హిట్ అయింది..అంటూ చెప్పుకొచ్చాడు.