Anasuya | యాంకర్ నుంచి యాక్టర్ గా మారిన అనసూయ భరద్వాజ్ తనకంటూ ఒక గుర్తింపును సాధించుకుంది. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోలో గ్లామరెస్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ భామ తర్వాత మంచి యాంకర్‌గా పేరు తెచ్చుకుంది. యాంకర్ నుంచి నటిగా మారిన అనసూయకు సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో నాగార్జునతో కలిసి నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా హిట్ అవ్వడం తర్వాత క్షణంలో నటించడం ఆ తర్వతా అది కూడా హిట్ ఇలా వెంట వెంటనే జరిగాయి.
ఆ తర్వాత అగ్ర దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త అనే పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. దీంతో అనసూయకు తిరుగులేకుండా పోయింది. ప్రస్తుతం పుష్ప సీక్వెల్లో నటిస్తుంది. తొలిపార్టులో మంగళం శ్రీను భార్యగా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇక సీక్వెల్ లో ఈమె పాత్రకు మరింత స్కోప్ ఉండనుందని తెలుస్తుంది.
అయితే ఇటీవల ఒక టీవి షోలో పాల్గోన్న అనసూయ ఒక క్రేజీ సీక్రెట్‌ను రివీల్ చేసింది. తాను పవన్ కళ్యాణ్‌తో కలిసి `హరి హర వీరమల్లు` సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేశానని నాకు ఈ విషయాన్ని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది అన్నారు అనసూయ. అంతకుముందు పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది చిత్రంలో ఐటమ్ సాంగ్ చేయమని ఆఫర్ వచ్చింది. కానీ నేను అప్పుడు నేను ప్రెగ్నెంట్ గా ఉండటం వలన చేయలేకపోయాను. కానీ హరి హర వీరమల్లుతో ఆ కోరిక నేరవేరిందని తెలిపింది.
Also Read..