IND vs SL | భారత్‌తో సిరీస్‌కు ముందే లంకకు భారీ షాక్.. గాయంతో కీలక పేసర్ ఔట్
IND vs SL | స్వదేశంలో భారత్‌తో త్వరలో మొదలుకావాల్సి ఉన్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందే శ్రీలంక జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ గాయంతో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.
IND vs SL | మరో మూడు రోజుల్లో స్వదేశంలో భారత్‌తో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనున్న శ్రీలంకకు సిరీస్ ప్రారంభానికి ముందే భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ దుష్మంత చమీర గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమైనట్టు తెలుస్తోంది. గత ఏడాదికాలంగా గాయాలతో సతమతమవుతున్న చమీర ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో రెండు మ్యాచ్‌లు ఆడాడు. భారత్‌తో సిరీస్‌కు కీలకంగా భావిస్తున్న అతడు కాలిగాయంతో తప్పుకోనున్నట్టు శ్రీలంక క్రికెట్ బోర్డు వర్గాల సమాచారం.
పొట్టి ఫార్మాట్లో లంకకు కీలక బౌలర్ అయిన చమీర.. గతేడాది వన్డే వరల్డ్ కప్‌లోనూ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. ఇటీవలే ముగిసిన లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్)లో ఆడిన చమీర.. క్యాండీ ఫాల్కన్స్ తరఫున ఆడుతూ ఆరు వికెట్లు పడగొట్టాడు. భారత్‌తో అతడికి మంచి రికార్డు ఉంది. టీమ్ఇండియాతో ఆడిన 15 మ్యాచ్‌లలో అతడు 16 వికెట్లు పడగొట్టాడు. టీ20లలో మతీశ పతిరానతో కలిసి బౌలింగ్ చేసే చమీర లేకపోవడం ఆ జట్టుకు లోటే. ఈ ఫార్మాట్లో 55 మ్యాచ్‌లు ఆడి 55 వికెట్లు పడగొట్టిన చమీర.. వన్డే సిరీస్‌కు అయినా అందుబాటులోకి వస్తాడా? లేడా? అనేదానిపైనా స్పష్టత లేదు.
కాగా లంక పర్యటనలో భారత జట్టు ఈ నెల 27 నుంచి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. రోహిత్ వారసుడిగా ఎంపికైన సూర్యకుమార్ యాదవ్, రాహుల్ ద్రావిడ్ స్థానాన్ని భర్తీ చేస్తున్న గౌతం గంభీర్‌కు ఇదే తొలి సిరీస్. మరోవైపు లంక జట్టులో కూడా హసరంగ తప్పుకోవడంతో చరిత్ అసలంక ఆ బాధ్యతలను మోయనున్నాడు. దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య తాత్కాలిక కోచ్ బాధ్యతలు మోయనున్నాడు.
Big relief to Team India.
Dushmantha Chameera has been ruled out of the white-ball series against Team India due to illness. pic.twitter.com/un1rEcBa8a
— Sujeet Suman (@sujeetsuman1991) July 24, 2024
భారత్‌తో టీ20లకు లంక జట్టు: చరిత్ అసలంక (కెప్టెన్), పతుమ్ నిస్సంక, కుశాల్ పెరీరా, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్, దినేశ్ చండిమాల్, కమిందు మెండిస్, దసున్ శనక, వనిందు హసరంగ, దునిత్ వెల్లలలె, మహీశ్ తీక్షణ, చమిందు విక్రమసింఘె, మతీశ పతిరాన, నువాన్ తుషారా, దుష్మంత చమీర, బినుర ఫెర్నాండొ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

