Plane crashes | నేపాల్‌లో వరుసగా విమాన ప్రమాదాలు.. కారణం ఏమై ఉంటుంది..?
Plane crashes | నేపాల్ వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇవాళ కూడా నేపాల్ రాజధాని ఖాట్మండులో ఓ ఎయిర్‌క్రాప్ట్ కుప్పకూలింది. త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది.
Plane crashes : నేపాల్ వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇవాళ కూడా నేపాల్ రాజధాని ఖాట్మండులో ఓ ఎయిర్‌క్రాప్ట్ కుప్పకూలింది. త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 19 మంది దుర్మరణం పాలయ్యారు. ఇంజిన్‌లో లోపం కారణంగా పొఖారా సిటీలో ఆగిపోయిన ఓ ఎయిర్‌క్రాఫ్ట్‌ను రిపేర్ చేసేందుకు టెక్నీషియన్స్‌ను తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదం జరిగిన సమయంలో ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఇద్దరు సిబ్బంది, 17 మంది టెక్నీషియన్స్ ఉన్నారని అధికారులు తెలిపారు. అయితే గడిచిన 12 సంవత్సరాల కాలంలో నేపాల్‌లో 13 విమాన ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వాటిలో 2023 జనవరి 16న జరిగిన ప్రమాదం అత్యంత తీవ్రమైనది. ఆ ప్రమాదంలో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. గత పన్నేండేళ్లుగా సగటున ఏడాదికి ఒక ప్రమాదం చొప్పున జరుగుతున్నది.
ఈ నేపథ్యంలో ఎందుకు నేపాల్‌లో వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే ఈ ప్రశ్నకు నిర్వహణా లోపమే కారణమనే సమాధానం వస్తోంది. నేపాల్ ఆర్థికవ్యవస్థ పటిష్టంగా లేకపోవడంతో అక్కడ ఎయిర్‌క్రాఫ్ట్‌ల నిర్వహణ సక్రమంగా లేదు. సరైన మౌలిక సదుపాయాలు లేవు. సిబ్బందికి శిక్షణంగా కూడా నాణ్యంగా లేదు. అందుకే నేపాల్‌లో సగటున ఏడాదికి ఒక్క విమాన ప్రమాదం జరుగుతున్నదని చెప్పవచ్చు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

