అనంత్ శ్రీరామ్ (Anantha Sriram)-ఎస్ థమన్ (S Thaman)..తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసే టాలెంట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్. అద్బుతమైన లిరిక్స్ రాసి పాటలకు పాపులారిటీ తెచ్చే టాలెంటెడ్ రైటర్ అనంత్ శ్రీరామ్. ఈ ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుంది. అచ్చు ‘కళావతి’ సాంగ్ లా ఉంటుంది. సర్కారు వారి పాటలో అనంత్ శ్రీరామ్ రాసిన కమాన్ కమాన్ కళావతి పాట ఏ రేంజ్లో పాపులర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
తనకిష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌కు స్పెషల్ గిఫ్ట్‌ను ప్రత్యేకంగా తయారు చేయించారు అనంత్ శ్రీరామ్. ఇంతరీ ఆ గిఫ్ట్ ఏంటనుకుంటున్నారా..? థమన్‌కు ఎంతో ఇష్టమైన క్రికెట్ బ్యాట్ (Cricket Bat). కస్టమ్ మేడ్ బ్యాట్ కశ్మీర్ లోని పుల్వామాలోఉన్న బ్యాట్ ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా చేయించాను. మీ కోసం కశ్మీర్ నుంచి హైదరాబాద్ తీసుకొస్తున్నా అని చెప్పారు అనంత్ శ్రీరామ్. లవ్ లీ బహుమతి ప్రియమైన థమన్ గారు..సర్కారు వారి పాట నుంచి #MassSongoftheYear ను విడుదల చేసేందుక త్వరగా రావాలి..రీట్వీట్ చేశాడు థమన్.
What a lovely gesture from dearest #ananthsriram gaaru ❤️
U made my day dear Ananth. Come soon let’s release the #MassSongoftheYear from #SarkaruVaariPaataMusic 🔥🧨🧨🧨🧨💣💣💣 #Gratitude #Happiness 🏆 pic.twitter.com/asPO784KPu— thaman S (@MusicThaman) April 25, 2022
మహేశ్ బాబు,కీర్తిసురేశ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కళావతి సాంగ్ ఇప్పటికే రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతుంది. మరి నెక్ట్స్ రాబోయే పాట ఏ స్థాయిలో ఉంటుందోనని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు మ్యూజిక్ లవర్స్.