Bhool Bhulaiyaa-2 Trailer Date | ‘లుకాచుప్పి’, ‘పతి పత్నీ ఔర్ వో’, ‘ధమాకా’ వంటి సినిమాలతో బాలీవుడ్లో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తీక్ ఆర్యన్. ఈయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘భూల్ భూలైయా-2’. 2007లో అక్షయ్ కుమార్, విద్యా బాలన్, అమీషా పటేల్ నటించిన ‘భూల్ భూలైయా’ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. అప్పట్లో ఈ చిత్రం హిందీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్టయిన మణిచిత్రతాఝు సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. భూల్ భూలైయా చిత్రం వచ్చి దాదాపు 15 ఏళ్ళు అయింది. ఇన్నేళ్ళ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కడంతో ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన బిగ్ అప్డేట్ను మేకర్స్ వెల్లడించారు.
ఇటీవలే విడుదలై టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ క్రమంలో చిత్ర బృందం ట్రైలర్ విడుదల తేదీను ప్రకటించింది. ఈ చిత్ర ట్రైలర్‌ను ఏప్రిల్ 26న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కియరా అద్వాని హీరోయిన్గా నటించింది. టబు, రాజ్‌పాల్ యాదవ్, పరేశ్ రావల్ కీలకపాత్రల్లో నటించారు. ‘టీ-సిరీస్’, ‘సినీ1 స్టూడీయోస్’ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. కామెడీ హార్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రం గతేడాది జులైలోనే విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. తిరిగి మార్చి 25న చిత్రం విడుదల కానున్నట్లు ప్రకటించారు. కానీ అదే రోజున ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కావడంతో పోటీ నుంచి తప్పుకున్నారు.
'BHOOL BHULAIYAA 2' TRAILER DROPS TOMORROW… Team #BhoolBhulaiyaa2 will launch #BhoolBhulaiyaa2Trailer tomorrow [26 April 2022]… Stars #KartikAaryan, #KiaraAdvani and #Tabu… Directed by #AneesBazmee… 20 May 2022 release. pic.twitter.com/NbyvICKj4X
— taran adarsh (@taran_adarsh) April 25, 2022