Anando Brahma | తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు సీక్వెల్స్‌కు, ఫ్రాంఛైజీలకు మంచి సీజన్ నడుస్తోంది. ప్రస్తుతం తెలుగులో పలు సీక్వెల్స్ సెట్స్ మీద వున్నాయి. ఇందులో ఈ భాగంగానే తాప్సీ కథానాయికగా నటించిన విజయవంతమైన హారర్ కామెడీ థ్రిల్లర్ ఆనందో బ్రహ్మాకు సీక్వెల్ రాబోతుంది. ఇంతకు ముందు ఆనందో బ్రహ్మా చిత్రాన్ని తెరకెక్కించిన దర్శక నిర్మాత మహి.వి.రాఘవ ఈ సీక్వెల్‌ను రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడు.
ఇంతకు ముందు మహి.వి రాఘవ పాఠశాల వంటి యూత్‌ఫుల్ చిత్రంతో పాటు యాత్ర, యాత్ర-2 వంటి పొలిటిలక్ థ్రిల్లర్స్‌కు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఆనందో బ్రహ్మకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ మొదలయ్యాయి. అయితే ఈ చిత్రం మొదటిభాగంలో నటించిన కథానాయిక తాప్సీని ఒప్పించే పనిలో వున్నాడు మహి. గత కొంత కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా వుంటున్నారు తాప్సీ. తెలుగులో ఆమె ఝమ్మంది నాదం, మిస్టర్ పర్ఫెక్ట్, మొగుడు, దరువు, సాహసం, షాడో, ఆనందో బ్రహ్మా, మిషాన్ ఇంపాజిబుల్ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.
అయితే మిషాన్ ఇంపాజిబుల్ చిత్రం తరువాత తాప్సీ ఏ తెలుగు సినిమాలో కనిపించలేదు. తెలుగులో హీరోయిన్ అంటే కేవలం గ్లామర్‌కే పరిమితం చేస్తున్నారనే ఆమె చేసిన కామెంట్స్ కూడా అప్పట్లో కొంత దుమారం రేపాయి. ఈ కారణంతోనే తెలుగులో సెలెక్టివ్‌గా నటిస్తున్న ఆమె ఎక్కువ బాలీవుడ్ సినిమాలపై కాన్స్రటేషన్ చేస్తున్నారట. సో.. మళ్లీ మహి.వి.రాఘవ ఈ సీక్వెల్ కోసం ఆమెను సంప్రదించి ఒప్పించినట్లు తెలిసింది. అంతేకాదు ఈ సినిమలో ఓ యంగ్‌హీరో కూడా ముఖ్యపాత్రలో కనిపించబోతున్నాడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని చేయాలనే ఆలోచనలో వున్నారు దర్శక నిర్మాతలు. పూర్తి వినోదాత్మకంగా హారర్ థ్రిల్లర్ రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఆనందో బ్రహ్మాను తమిళంలో పెట్రోమాక్స్గా రిమేక్ చేయగా.. ఇందులో తమన్నా కథానాయికగా నటించింది.
Also Read..
Prakasam barrage | ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద.. 70 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
Akhilesh Yadav: వినేశ్ పోగట్‌పై అనర్హత.. దర్యాప్తుకు అఖిలేశ్ డిమాండ్
AP News | తనను ఘోరంగా ఓడించిన ఏపీని నాశనం చేయడమే అతని లక్ష్యం.. జగన్‌పై టీడీపీ ఫైర్