అమరావతి : ప్రకాశం బ్యారేజీకి(Prakasam barrage) వరద పోటెత్తుతుంది. శ్రీశైలం(Srisailam), నాగార్జునసాగర్, పులిచింతల(Pulichintala ) ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఆ నీరు ప్రకాశం బ్యారేజీకి వచ్చి చేరుతుంది. దీంతో బ్యారేజీ అధికారులు 70 గేట్లు ఎత్తి దిగువకు 73,227 క్యూసెక్కులు, ఉప కాలువల ద్వారా మరో 13,477 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాయంత్రం వరకు లక్షన్నర క్యూసెక్కుల నీటిని విడుదల చేసే అవకాశముంది.
ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తడం వల్ల కృష్ణా (Krishna), ఎన్టీఆర్(NTR District) జిల్లాల్లోని తీర ప్రాంత గ్రామల ప్రజలను అప్రమత్తం చేశారు. అధికారులు ఎప్పటికప్పుడూ వరద నీటిని అంచనా వేస్తూ ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో రాత్రి కురిసిన భారీ వర్షం కురిసింది. దీంతో విజయవాడలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరువూరు నియోజకవర్గంలో కట్లేరు, ఎదుళ్లవాగులు, విప్ల, పడమటి, గుర్రపు, కొండ వాగులు పొంగిపొర్లాయి. రహదారులపై నీరు రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
Pithapuram | పిఠాపురంలో వైసీపీకి షాక్.. రాజీనామా చేసిన పెండెం దొరబాబు