Akhilesh Yadav: వినేశ్ పోగట్పై అనర్హత.. దర్యాప్తుకు అఖిలేశ్ డిమాండ్
Akhilesh Yadav: పారిస్ ఒలింపిక్స్లో రెజ్లర్ వినేశ్ పోగట్ పై అనర్హత వేటు వేసిన అంశంలో దర్యాప్తు చేపట్టాలని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ డిమాండ్ చేశారు. 50 కేజీల ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్లో.. వినేశ్ ఫైనల్కు చేరిన విషయం తెలిసిందే.
లక్నో: పారిస్ ఒలింపిక్స్లో రెజ్లర్ వినేశ్ పోగట్ పై అనర్హత వేటు వేసిన అంశంలో దర్యాప్తు చేపట్టాలని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్(Akhilesh Yadav) డిమాండ్ చేశారు. 50 కేజీల ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్లో.. వినేశ్ ఫైనల్కు చేరిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ రెండవ రోజు ఆమె వెయిట్ చెక్ చేశారు. దాంట్లో ఆమె బరువు వంద గ్రాములు ఎక్కువగా ఉన్నది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ఆమెపై వేటు వేసింది. వినేశ్ పోగట్పై వేటు వేసిన ఘటనలో సాంకేతిక కారణాలపై అన్వేషణ చేపట్టాలని అఖిలేశ్ డిమాండ్ చేశారు. దాని వెనుక ఉన్న అసలైన కారణం బయటకు రావాలన్నారు. తన ఎక్స్ అకౌంట్లో అఖిలేశ్ యాదవ్ ఈ విషయాన్ని పోస్టు చేశారు.
विनेश फोगाट के फ़ाइनल में न खेल पाने की चर्चा के तकनीकी कारणों की गहरी जाँच-पड़ताल हो और सुनिश्चित किया जाए कि सच्चाई क्या है और इसके पीछे की असली वजह क्या है।
— Akhilesh Yadav (@yadavakhilesh) August 7, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

