Anand Deverakonda | బేబి సినిమాతో సూపర్ హిట్టు కొట్టాడు ఆనంద్దేవరకొండ. ఆ తర్వాత వినోద్ అనంతోజ్ డైరెక్షన్లో నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. వినోద్ అనంతోజ్, ఆనంద్ దేవరకొండ కాంబోలో మరో సినిమా రాబోతుంది. ఈ ఇద్దరూ ఈ సారి విభిన్న కథాంశంతో వస్తున్నట్టు తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ చెబుతోంది.
ఆనంద్ దేవరకొండ నటిస్తున్న నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ Takshakudu. ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటిస్తూ టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఇందులో ఆనంద్ దేవరకొండ నక్సలైట్‌గా కనిపించబోతున్నట్టు క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. వేటగాడి చరిత్రలో జింకలు దోషులు.. అనే క్యాప్షన్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ మూవీలో లాపతా లేడీస్ ఫేం నటాన్షి గోయెల్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రీమియర్ డేట్‌తోపాటు ఇతర వివరాలపై రానున్న రోజుల్లో క్లారిటీ ఇవ్వనుంది ఆనంద్ దేవరకొండ టీం. తిరుగుబాటు ప్రతీకార డ్రామా నేపథ్యంలో వచ్చే ఈ చిత్రంపై ఫస్ట్ లుక్‌తో అంచనాలు పెరిగిపోతున్నాయి.
It started with atyasa, and prateekaram will follow. 🔥
Watch #Takshakudu, coming soon, only on Netflix.#TakshakuduOnNetflix #AnandDeverakonda @nitanshi_goel @vinodanantoju @vamsi84 #SaiSoujanya #MidhunMukundan @NavinNooli #MokshadhaBhupatiraju #UditKhurana @balaji_dop137… pic.twitter.com/LpifH7wSmT
— Sithara Entertainments (@SitharaEnts) October 13, 2025
Srinidhi Shetty | సిద్ధు పాత్రతో ప్రేమలో పడిపోతారు.. తెలుసు కదా సినిమాపై శ్రీనిధి శెట్టి
Kiran Abbavaram | కిరణ్ అబ్బవరం వెబ్‌సిరీస్ జోనర్ ఇదేనట..!