Anaganaga Oka Raju | జాతి రత్నాలు ఫేం నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) హీరోగా నటిస్తోన్న చిత్రం అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju). మారి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ 2026 జనవరి 14న ఈ మూవీ గ్రాండ్‌గా విడుదల కానుంది. కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రంతో నవీన్ పొలిశెట్టి సింగర్‌గా మారబోతున్నాడని తెలిసిందే. దీనికి సంబంధించి అధికారిక అప్డేట్ వచ్చేసింది.
నవీన్ పొలిశెట్టి పాడిన భీమవరం బల్మా పాటను నవంబర్ 27న లాంచ్ చేయనున్నట్టు షేర్ చేశారు మేకర్స్. పండగకు స్టెప్పులు వేయడానికి రెడీగా ఉండండి.. అంటూ ప్లేబ్యాక్ సింగర్ కావడానికి నవీన్ పొలిశెట్టి పడుతున్న కష్టాలను చూపిస్తూ ఫన్నీగా కట్ చేసిన వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
సితార ఎంటర్టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో వస్తోన్న ఈ చిత్రాన్ని ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కో ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్టర్.
అనగనగా ఒక రాజు ప్రీ వెడ్డింగ్ వీడియో..
రాజుగారి పెళ్లి విందులో చమ్మక్ చంద్ర అరేయ్ ఇది రాజుగారి పెళ్లి.. గెస్టులందరికీ గోల్డ్ ప్లేట్స్ మాత్రమే పెట్టండి.. అంటూ చెప్పే డైలాగ్స్‌తో మొదలైంది ప్రీ వెడ్డింగ్ వీడియో. అతిథుల్లో ఓ వ్యక్తి ఏంటండి వీళ్లు ప్లేటు గోల్డ్.. స్వీటు గోల్డ్ అంటున్నారు.. ఇదేమైనా మలబార్ గోల్డ్ వాళ్ల పెళ్లా అని అడుగుతుంటే.. మరో వ్యక్తి ఏవండి ఇది మా రాజుగారి పెళ్లండి అని అంటున్నాడు.
నవీన్ పొలిశెట్టి ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వెడ్డింగ్ క్యాసెట్ చూస్తూ.. ముఖేశ్ అంబానీకి ఫోన్ చేసి.. ముఖేశ్ మామయ్యా ఈవెంట్‌కు వచ్చిన సెలబ్రిటీల ఫోన్ నంబర్లు పెట్టు చెబుతా.. ఈ ఇయర్ అంతా అంబానీ పెళ్లి.. వచ్చే ఏడాదంతా రాజుగారి పెళ్లి అంటున్నాడు. జాతి రత్నాలు హీరో స్టైల్ ఆఫ్ హ్యూమర్ టచ్‌తో సాగుతున్న వీడియో సినిమాపై అంచనాలు అమాంతం చేస్తోంది.
Star Entertainer @NaveenPolishety turns PLAYBACK SINGER for the first time. First song #BhimavaramBalma out on Nov 27th ❤️
PANDAGA ki stepulu veyadaaniki ready ga undandi…. 🕺🏻 #AnaganagaOkaRaju on JAN 14th, 2026. #AOR #NaveenPolishetty4 #AOROnJan14th @Meenakshiioffl #Maari… pic.twitter.com/8IsO2ofV8P
— Sithara Entertainments (@SitharaEnts) November 25, 2025
Vishal | నటుడు విశాల్‌కు భారీ షాక్.. 30% వడ్డీతో చెల్లించాల్సిందేనంటూ మద్రాసు హైకోర్టు తీర్పు
Zubeen Garg | జుబీన్ గార్గ్ ప్రమాదవశాత్తూ మరణించలేదు.. ఆయన్ని హత్య చేశారు : సీఎం హిమంత శర్మ
Ravi Teja | ఇక ఓటీటీలో మాస్ జాతర మొదలు.. రవితేజ మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..!