Amy Jackson | బాలీవుడ్ నటి అమీ జాక్సన్ (Amy Jackson) మరోసారి తల్లైంది. పండండి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అమీ జాక్సన్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. బాబుకు ఆస్కార్ అలెగ్జాండర్ వెస్ట్విక్ (Oscar Alexander Westwick) అని పేరు పెట్టినట్లు తెలిపింది. ఈ మేరకు భర్త, బిడ్డతో దిగిన ఫొటోను పంచుకుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు, అభిమానులు అమీ జాక్సన్ జంటకు కంగ్రాట్స్ చెబుతూ పోస్టులు పెడుతన్నారు.
కాగా, అమీ జాక్సన్ సినిమాల్లోకి వచ్చే ముందు మోడల్‌గా రాణించింది. 2010లో తమిళంలో ‘మద్రాస్పట్టణం’ మూవీతో చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్లో ప్రతీక్ బబ్బర్ సరసన ‘ఏక్ దీవానా థా’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. 2014లో తెలుగులో గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటించిన ‘ఎవడు’ చిత్రంలో నటించింది. ఆ తర్వాత 2018లో సూపర్‌స్టార్ రజనీకాంత్ రోబో 2.O చిత్రంతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. అలాగే చియాన్ విక్రమ్ ‘ఐ’మూవీలోనూ మెరిసింది. ప్రస్తుతం అమ్మడు తెలుగు సినిమాలకు దూరమైంది. గతేడాది ఆగస్టులో తన ప్రియుడు, హాలీవుడ్ నటుడు ఎడ్ విస్ట్విక్ (Ed Westwick)ను రెండో వివాహం చేసుకుంది. దక్షిణ ఇటలీలోని 16వ శతాబ్ధం నాటి కాస్టెల్లో రోకో కోటలో ఆమె ఎడ్ వెస్ట్విక్ను మనువాడింది.
అమీజాక్సన్ గతంలో జార్జ్ పనయోట్టు అనే బిజినెస్‌మెన్‌తో ప్రయాణం నడిపి.. 2019లో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత పెళ్లి కాకుండానే ఓ బిడ్డకు జన్మనించింది. వీరి ప్రేమ ఎక్కువ కాలం నిలువలేదు. చివరకు 2022లో పనయోట్టుతో తనబంధం ముగిసిందని ప్రకటించింది. అప్పటి నుంచి కుమారుడు ఆండ్రెస్‌తో ఒంటరిగానే ఉంటూ వచ్చింది. ఆ తర్వాత అమీ జాక్సన్ హాలీవుడ్ స్టార్ వెస్ట్‌విక్‌తో ప్రేమలో పడింది.
Also Read..
Mahatma Jyotirao Phule | మహాత్మా జ్యోతి రావు ఫూలేపై బయోపిక్.. ట్రైలర్ చూశారా.!
Aditya 369 | నందమూరి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఆదిత్య 369’ రీ రిలీజ్ డేట్ వచ్చేసింది
Chhaava in Parliament | పార్లమెంట్లో ‘ఛావా’ మూవీ స్పెషల్ స్క్రీనింగ్